NewsDabba

Putta Mahesh Yadav : డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా..! ఘన చరిత్రే..!!

Putta Mahesh Yadav : ఏలూరు (Eluru) తెలుగుదేశం పార్టీ ఎంపీ (TDP MP) పుట్టా మహేశ్ యాదవ్ (Putta Mahesh Yadav) డ్రగ్స్ కేసులో పట్టుబడడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ (Drugs Party) ఉదంతం ఆయన చుట్టూ అనేక వివాదాలను అల్లుకుంది. పుట్టా మహేశ్ యాదవ్ కేవలం ఒక ఎంపీగానే కాకుండా, రెండు రాష్ట్రాల్లోని అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన టిటిడి (TTD) మాజీ చైర్మన్, ప్రస్తుత మైదుకూరు (Mydukur) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ (Putta Sudhakar Yadav) కుమారుడు. పుట్టా సుధాకర్ యాదవ్ రాష్ట్రంలో ప్రముఖ కాంట్రాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా బలమైన ముద్ర వేశారు.

మహేశ్ యాదవ్ కుటుంబ సంబంధాలు రెండు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఆయన ఒక సోదరుడు తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు (Talasani Srinivasa Yadav( అల్లుడు. ఇక పుట్టా మహేశ్ యాదవ్ (Putta Mahesh Yadav) స్వయంగా మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడి (Yanamala Ramakrishnudu) అల్లుడు. యనమల రెండో కుమార్తె కృష్ణ సాహిత్యను ఆయన వివాహం చేసుకున్నారు. ఇటు తలసాని, అటు యనమల వంటి దిగ్గజ కుటుంబాలతో వియ్యం అందుకున్న పుట్టా కుటుంబానికి రాజకీయంగా, ఆర్థికంగా అపారమైన పలుకుబడి ఉంది.

Revanth Reddy
Revanth Reddy: దమ్మున్న నాయకుడి దిమ్మతిరిగే వ్యూహం!

2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు స్థానం (Eluru MP) నుంచి పుట్టా మహేశ్ యాదవ్ (Putta Mahesh Yadav) అభ్యర్థిత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఏలూరు సీటు కోసం టీడీపీలో ఎంతోమంది సీనియర్లు పోటీపడ్డారు. అయితే, సామాజిక సమీకరణాల దృష్ట్యా టీడీపీ అధిష్టానం బీసీ కోటాలో మహేశ్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. గతంలో ఏలూరులో టీడీపీ (TDP) తరపున బీసీలకు అవకాశం ఇచ్చిన చరిత్ర తక్కువ, కానీ వైసీపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబానికి ఉన్న ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడి తోడవ్వడంతో తొలి ప్రయత్నంలోనే ఆయన సునాయాసంగా విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Chandrababu: అదానీకి చంద్రబాబు జీ హుజూర్..!!

Sindhu Hospital - Bandi Parthasarathi Reddy
Sindhu Hospital: మూడు పార్టీల ‘సింధు హాస్పిటల్’!

ఎంపీగా ఉన్న పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో వినిపించడం సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) ఫార్మ్ హౌస్‌లో (Farm House) జరిగిన వీకెండ్ పార్టీపై పోలీసులు దాడి చేసినప్పుడు మహేశ్ యాదవ్ అక్కడ ఉన్నారు. దాడి జరిగిన వెంటనే జరిగిన యూరిన్ పరీక్షల్లో పుట్టా మహేశ్ యాదవ్ కు నెగెటివ్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇవాళ జరిపిన బ్లడ్ శాంపిల్ టెస్టులో మాత్రం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిపోయింది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడం, టీడీపీకి తలనొప్పిగా మారింది. యువ నేతలకు అవకాశం ఇస్తుంటే, వారు ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల చంద్రబాబు, నారా లోకేష్ వంటి అగ్రనేతలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పుట్టా కుటుంబం ఇటీవలే మరో వివాదంలో కూడా చిక్కుకుంది. పుట్టా సుధాకర్ యాదవ్ ఒక సైబర్ క్రైమ్ బాధితుడిగా మారి భారీ మొత్తంలో డబ్బు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంత పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లకు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఏదైనా బ్లాక్ మెయిలింగ్ జరిగిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Pawan Kalyan alliance strategy
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పొలిటికల్ మాస్టర్ క్లాస్!

పుట్టా మహేశ్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఈ కేసు దర్యాప్తుపై ఆధారపడి ఉంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు, టీడీపీ పరువు కూడా దీనికి ముడిపడి ఉంది. రాజకీయ వారసత్వం, ఆర్థిక బలం ఉన్నప్పటికీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వివాదాలకు దూరంగా ఉండలేకపోవడం ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment