NewsDabba

KCR Exposed : కేసీఆర్ ‘పిట్టలదొర’ మాటలు Vs ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు

KCR Exposed: రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ఆ విమర్శలు వాస్తవాలకు దరిదాపుల్లో ఉండాలి. అబద్ధాలను సైతం అలవోకగా చెప్పేసి తాను చెప్పిందే నిజమని భ్రమించే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) మరోసారి తనదైన శైలిలో అవాకులు, చెవాకులు పేలారు. చాలాకాలం అజ్ఞాతంలో ఉండి, హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) విమర్శించే క్రమంలో ఏపీ (Andhra Pradesh) సీఎం చంద్రబాబుపై (Chandrababu) పడ్డారు. ముఖ్యంగా 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్లపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన అవగాహనా రాహిత్యమో లేక కావాలని చేస్తున్న దుష్ప్రచారమో (KCR Exposed) అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

అసత్యాల కోట కేసీఆర్.. వంటవాళ్లతో ఒప్పందాలా?

విశాఖపట్నంలో చంద్రబాబు (Chandrababu) హయాంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులపై కేసీఆర్ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హోటళ్లలో పని చేసే వంటవాళ్లను పిలిపించి, కోట్లకు కోట్లు ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అసలు పెట్టుబడులే రాలేదని, కేవలం హంగామా మాత్రమే జరిగిందని కొట్టిపారేశారు. అయితే, కేసీఆర్ చెబుతున్న ఈ వంటవాళ్ల కథలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిశ్రమల వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదు. కేసీఆర్ వ్యాఖ్యలు కేవలం ఆంధ్రప్రదేశ్‌ను, అక్కడి పారిశ్రామిక అభివృద్ధిని తక్కువ చేసి చూపే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.

అంకెలు అబద్ధం చెప్పవు కేసీఆర్ (KCR)!

2014లో రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌తో, రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా నిలబెట్టేందుకు చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో 3 సార్లు సిఐఐ (CII) భాగస్వామ్య సదస్సులను నిర్వహించారు.

1. 2016 జనవరి: తొలి సదస్సులో రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు.
2. 2017 జనవరి: రెండో సదస్సులో రూ. 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఒప్పందాలు.
3. 2018 ఫిబ్రవరి: మూడో సదస్సులో రూ. 4.39 లక్షల కోట్ల ఒప్పందాలు.

Freebies vs Welfare
Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!

మొత్తంగా ఐదేళ్లలో రూ. 18.87 లక్షల కోట్ల మేర అవగాహన ఒప్పందాలు (MoUs) జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లోనైనా 100% ఒప్పందాలు వెంటనే గ్రౌండింగ్ కావు. కానీ, కేసీఆర్ విమర్శించినట్టుగా ఏమీ రాలేదు అనడం పచ్చి అబద్ధం. తర్వాతి కాలంలో వచ్చిన ప్రభుత్వ నివేదికలు, పారిశ్రామిక గణాంకాల ప్రకారం, సుమారు రూ. 1.8 లక్షల కోట్ల నుండి రూ. 2.82 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి లేదా వివిధ పురోగతి దశల్లో నిలిచాయి. ఏటా సగటున రూ. 11,994 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహించాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

వచ్చిన కంపెనీలు కూడా వంటవాళ్లవేనా కేసీఆర్ (KCR Exposed) గారూ?

కేసీఆర్ చేసిన ‘వంటవాళ్ల’ కామెంట్లను తిప్పికొట్టేలా ఆంధ్రప్రదేశ్ గడ్డపై నేడు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న దిగ్గజ సంస్థలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కళ్లు తెరిచి ఈ క్రింది జాబితా చూస్తే ఆయన అజ్ఞానం బయటపడుతుంది.

1. ఆటోమొబైల్ రంగంలో అద్భుతం – అనంతపురం సాక్షి!

ఒకప్పుడు కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో నేడు గ్లోబల్ బ్రాండ్ కియా మోటార్స్ (Kia Motors) కార్లు తయారవుతున్నాయి. రూ. 13,500 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పడింది. అలాగే, చిత్తూరులో అపోలో టైర్స్ (Apollo Tyres) రూ. 4,500 కోట్లతో, శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ (Isuzu Motors) రూ. 3,000 కోట్లతో యూనిట్లు పెట్టాయి. ఇవి వంటవాళ్లు పెట్టిన షాపులు కావు, వేల కోట్లతో నిర్మించిన భారీ పరిశ్రమలు.

2. ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తిరుపతి – శ్రీసిటీ

Jogi Ramesh Family cheating exposed
Jogi Ramesh: ఆడబిడ్డ జీవితం నాశనం చేసిన ‘జోగి’ ఫ్యామిలీ!

ప్రపంచ ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ (Foxconn) సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్‌లో వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ (Dixon Technologies), కార్బన్, లావా, సెల్‌కాన్ వంటి మొబైల్ కంపెనీలు తిరుపతి చుట్టుపక్కల విస్తరించాయి. ఐఫోన్లు, టీవీలు ఇక్కడే తయారవుతున్నాయి.

3. ఐటీ రంగం విస్తరణ

చంద్రబాబు హయాంలో విజయవాడ సమీపంలోని గన్నవరంలో హెచ్‌సిఎల్ (HCL) రూ. 750 కోట్లతో క్యాంపస్ నిర్మించింది. తిరుపతిలో జోహో (Zoho), విశాఖలో పేటిఎం (Paytm), ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు తమ అడుగుజాడలు వేశాయి.

4. పరిశ్రమల వరద

విశాఖలో ఏషియన్ పెయింట్స్ (Asian Paints) రూ. 1,785 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసింది. శ్రీసిటీలో మొండెలెజ్ (క్యాడ్‌బరీ), పెప్సికో, కోల్గేట్ పామోలివ్ వంటి బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇవన్నీ చంద్రబాబు హయాంలో కుదిరిన ఒప్పందాల ఫలితాలే.

TBJP
TBJP: తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసుకుందా?

అసూయతో ఆంధ్రపై విషం చిమ్ముతున్న కేసీఆర్

చంద్రబాబు అంటే కేసీఆర్‌కు ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా భావం. 2014-19 మధ్య ఏపీ అభివృద్ధి వేగాన్ని చూసి తట్టుకోలేక, తెలంగాణలో తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం కేసీఆర్ అలవాటు. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయి, రాజకీయంగా అస్తిత్వం కోసం పోరాడుతున్న తరుణంలో, మళ్లీ పాత పద్ధతిలోనే అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారు.

నిజానికి కేసీఆర్ హయాంలో జరిగిన పెట్టుబడి ఒప్పందాలు ఎన్ని? వాటిలో గ్రౌండింగ్ అయినవి ఎన్ని? అన్న లెక్కలు తీస్తే కేసీఆర్ (KCR) అసలు రంగు బయటపడుతుంది. తాను తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు తెచ్చిందో చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ పైన, చంద్రబాబు (Chandrababu) పైన ఏడవడం ఆయనకు అలవాటైపోయింది. ఏపీలో లక్షలాది మందికి ఉపాధినిస్తున్న కియా మోటార్స్ వంటి ఒక్క భారీ ప్రాజెక్టును కూడా తెలంగాణకు పదేళ్లలో కేసీఆర్ తీసుకురాలేకపోయారు.

నోరు తెరిస్తే అబద్ధాలు, ఊహాజనిత కథలు, ఎదుటివారిని కించపరిచే మాటలు.. ఇవీ కేసీఆర్ మార్క్ రాజకీయాలు. అందుకే ఆయన్ను ప్రజలు పిట్టలదొర అని పిలుచుకుంటున్నారు. విశాఖ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలు, నేడు ఆంధ్రప్రదేశ్ గడ్డపై కనిపిస్తున్న భారీ ఫ్యాక్టరీలు కేసీఆర్ అజ్ఞానానికి చెంపపెట్టు. తన రాజకీయ పతనాన్ని ఆపుకోవడానికి పక్క రాష్ట్రం మీద, అక్కడి నాయకుల మీద విషం చిమ్మడం మానేసి, వాస్తవాలను గౌరవించడం నేర్చుకుంటే కేసీఆర్ కు మంచిది. అబద్ధాలతో చరిత్రను చెరిపివేయలేరు, గణాంకాలను మార్చలేరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment