NewsDabba

Donald Trump: కబేళా యజమాని అహింసావాదం!

Donald Trump: ప్రపంచ శాంతికి నోబెల్ బహుమతి.. ఇది ఒకప్పుడు నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా వంటి మహనీయుల త్యాగాలకు దక్కిన గౌరవం. కానీ నేడు, ఆ పవిత్ర పురస్కారం కోసం ఒక రాజకీయ భస్మాసురుడు, అంతర్జాతీయ ఆర్థిక నేరగాడు, అహంకారానికి నిలువుటద్దమైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అర్రులు చాచడం ఆధునిక మానవ చరిత్రలోనే అత్యంత అసహ్యకరమైన ఘట్టం. తాను ఏడు యుద్ధాలు (Wars) ఆపానని శ్వేతసౌధం గోడల మధ్య కూర్చుని డబ్బా కొట్టుకుంటున్న ఈ ‘నయా హిట్లర్’, నిజానికి ప్రపంచాన్ని ఒక అస్థిరమైన అగ్నిగుండంలా మార్చేశారు. ఒక చేత్తో బాంబులు కురిపిస్తూ, మరో చేత్తో నోబెల్ కమిటీని బ్లాక్ మెయిల్ చేస్తున్న ట్రంప్ వైఖరి చూస్తుంటే.. కబేళా యజమాని అహింస గురించి ఉపన్యాసాలు ఇచ్చినట్లే ఉంది. తన అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి, దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, స్వదేశంలోనే ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తికి శాంతి బహుమతి (Nobel peace prize) ఇవ్వాలా? లేక అంతర్జాతీయ నేరస్తుడిగా బోనులో నిలబెట్టాలా? ట్రంప్ సృష్టిస్తున్న విధ్వంసంపై, ఆయన సాగిస్తున్న ‘ఆర్థిక ఉగ్రవాదం’ అంతాఇంతా కాదు.

శవాల గుట్టలపై ‘శాంతి’ పాటలా?

ట్రంప్ తన విదేశీ విధానాన్ని ‘అమెరికా ఫస్ట్’ (America First) అంటారు, కానీ అది నిజానికి ‘విధ్వంసం ఫస్ట్’. ఆయన హయాంలో అంతర్జాతీయ చట్టాలు కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయాయి.
ఇరాన్ పై రాక్షసానందం: 2025 చివరి నాటికి, 2026 ప్రారంభంలో ఇరాన్ (Iran) పై ట్రంప్ సాగిస్తున్న బాంబుల మోత ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. గతంలో ఇరాన్ అగ్ర సేనాని ఖాసిం సులేమానీని హత్య చేసిన క్రూరత్వానికి కొనసాగింపుగా, ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేస్తూ మధ్యప్రాచ్యాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టారు. ఈ దాడుల వల్ల గడిచిన ఆరు నెలల్లోనే వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ పై విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఆ దేశంలో మందులు అందక ప్రతిరోజూ వందలాది మంది మరణిస్తున్నారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని (Ali Khamenei) హతమార్చారు. ఆ దేశ అగ్రనాయకులందరినీ మట్టుబెట్టారు. ఇది ‘శాంతి’ ఎలా అవుతుంది ట్రంప్?
వెనెజులాలో అంతర్జాతీయ మాఫియా: ఒక స్వతంత్ర దేశ అధ్యక్షుడిని (నికోలస్ మదురో) నేరస్థుడిగా ప్రకటించి, ఆయన తలపై బహుమతి ప్రకటించి, సైనిక బలగాలతో కిడ్నాప్ చేయించి అమెరికా (America) జైల్లో పడేయడం ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది పక్కా అంతర్జాతీయ రౌడీయిజం. వెనెజులా ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును ట్రంప్ (Donald Trump) కాలరాశారు. ఇదే పద్ధతిని ఇప్పుడు క్యూబాపై కూడా ప్రయోగించాలని చూడటం ఆయన వికృత చేష్టలకు పరాకాష్ట.
గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ కాంక్ష: “గ్రీన్ ల్యాండ్ (Greenland) ను కొనేస్తాను” అని ప్రకటించడం ద్వారా సార్వభౌమ దేశాలను ట్రంప్ తన వ్యాపార సామ్రాజ్యంలోని రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా భావిస్తున్నారు. డెన్మార్క్ సార్వభౌమాధికారాన్ని అవమానిస్తూ, ఆ ద్వీపాన్ని తన సొంత ఆస్తిలా భావించే ట్రంప్ (Donald Trump) మనస్తత్వం చూస్తుంటే, ఆయన 21వ శతాబ్దపు సామ్రాజ్యవాదానికి వారసుడిలా కనిపిస్తున్నారు.

Meta Fined Over Kids Mental Health!
Kids Mental Health: పిల్లల మనస్సులతో ఆట.. మెటాకు రూ.8,967 కోట్ల జరిమానా!

ఆర్థిక ఉగ్రవాదం: సుంకాలతో ప్రపంచంపై దాడి

ట్రంప్ కేవలం తుపాకులతోనే కాదు, సుంకాలు (Tariffs) అనే ఆర్థిక బాంబులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలను బూట్ల కింద తొక్కుతూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడిని భిక్షగాడిని చేస్తున్నాయి.
చైనాపై దండయాత్ర: చైనా నుంచి వచ్చే దాదాపు 550 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25% నుండి 60% వరకు సుంకాలు విధించి, గ్లోబల్ సప్లై చైన్ ను నాశనం చేశారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ధరలు 20% పైగా పెరిగాయి. ఇది చైనాను దెబ్బతీయడం కాదు, ప్రపంచ వినియోగదారుడి జేబుకు కన్నం వేయడం.
భారత్ కు వెన్నుపోటు: భారత్ ను మిత్రదేశం అంటూనే, జీఎస్పీ (GSP) హోదాను రద్దు చేసి, భారతీయ ఎగుమతులపై 7 బిలియన్ డాలర్ల అదనపు భారం వేశారు. స్టీల్, అల్యూమినియం రంగాలపై ఆయన వేసిన పన్నుల వల్ల వేలమంది భారతీయ కార్మికులు రోడ్డున పడ్డారు.
యూరోప్ వణుకు: నాటో (NATO) మిత్రదేశాలను సైతం వదలకుండా వాణిజ్య యుద్ధం ప్రకటించిన ట్రంప్, దశాబ్దాల మైత్రిని మంటగలిపారు. జర్మనీ కార్లు, ఫ్రెంచ్ వైన్ పై ఆయన వేసిన అడ్డదిడ్డమైన పన్నులు అట్లాంటిక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తెచ్చాయి.
గణాంకాల ప్రకారం, ట్రంప్ విధించిన సుంకాల వల్ల అమెరికాలోని ప్రతి కుటుంబంపై ఏడాదికి సగటున 1500 డాలర్ల అదనపు భారం పడుతోంది. అంటే ఒకవైపు దేశ భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తూ, మరోవైపు వారి రక్తాన్ని పన్నుల రూపంలో పిండుకుంటున్నారు.

అంతర్జాతీయ సంస్థల గొంతు నులిమిన నియంత

ఒక వ్యవస్థను నిర్మించడం కష్టం, కానీ కూల్చడం సుభలం. ట్రంప్ (Donald Trump) సరిగ్గా అదే చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్‌ఓ (WHO), ఐఎంఎఫ్ (IMF) వంటి సంస్థలను ఆయన తన జేబు సంస్థలుగా మార్చుకోవాలని చూశారు.
IMF నిధుల నిలిపివేత: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అమెరికా ఇవ్వాల్సిన 17.5% వాటాను అడ్డం పెట్టుకుని, తన మాట వినని దేశాలకు (పాకిస్థాన్, అర్జెంటీనా వంటివి) అందే అత్యవసర రుణాలను అడ్డుకున్నారు. ఇది లక్షలాది మంది ఆకలి చావులకు కారణమవుతోంది.
WHO నుంచి నిష్క్రమణ: ప్రపంచం కొత్త కొత్త వైరస్‌లతో పోరాడుతుంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ఫండింగ్ ఆపేసి కోట్లాది మంది ప్రాణాలను పణంగా పెట్టారు. 2026 నాటికి ఈ నిధుల కోత వల్ల ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 40% మందగించింది.
పారిస్ ఒప్పందం: భూగోళం వేడెక్కుతుంటే, వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకుని రాబోయే తరాలకు మరుభూమిని మిగిల్చేందుకు సిద్ధపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కంటే బొగ్గు గనుల లాభాలే ఆయనకు ముఖ్యం.

Americaలోనే ‘విలన్’ అయిన అధ్యక్షుడు

సొంత ఇంటిని చక్కదిద్దలేని వాడు ప్రపంచాన్ని మారుస్తానంటే నమ్మేది ఎవరు?
సుప్రీంకోర్టు చీత్కారం: అమెరికా సుప్రీంకోర్టే ట్రంప్ తీసుకున్న వలస విధానాలను, సరిహద్దుల వద్ద గోడ నిర్మాణానికి అక్రమంగా నిధులు మళ్లించడాన్ని ‘రాజ్యాంగ విరుద్ధం’ అని పలుమార్లు ఎండగట్టింది.
కాంగ్రెస్ ఆగ్రహం: చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనంతగా అభిశంసనలు ఎదుర్కోవడమే ఆయన ‘యోగ్యత’కు నిదర్శనం. అమెరికా పార్లమెంటులో ఆయన దుందుడుకు వైఖరిపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జాత్యహంకార చిచ్చు: ‘వైట్ సుప్రీమసీ’ని పరోక్షంగా ప్రోత్సహిస్తూ అమెరికాను రెండుగా చీల్చిన ఘనత ఆయనదే. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడంలో విఫలమవడమే కాకుండా, వారి ఆందోళనలను సైనిక బలగాలతో అణచివేయడం ట్రంప్ నైజం.

Anglo Mysore War
Anglo Mysore War : మైసూర్ వీరులు.. అమెరికా స్వాతంత్ర్య సమరంలో వ్యూహకర్తలు!

ఇది కూడా చదవండి: GULF: అంతం దిశగా చమురు సామ్రాజ్యం..!?

నోబెల్ శాంతి బహుమతి కావాలా?

శాంతి అంటే యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, భయం లేకపోవడం. కానీ ట్రంప్ అంటేనే భయం. ఒక దేశాన్ని ఆక్రమించుకుంటాను అని బెదిరించే వాడికి, దేశాధినేతలను కిడ్నాప్ చేసే వాడికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే వాడికి నోబెల్ ఇవ్వాలా?
* శాంతి అంటే అధికార గర్వంతో దాడులు చేయడం కాదు.
* శాంతి అంటే అంతర్జాతీయ ఒప్పందాలను చించివేయడం కాదు.
* శాంతి అంటే ఆర్థిక ఆంక్షలతో దేశాలను బ్లాక్ మెయిల్ చేయడం కాదు.
ట్రంప్ (Donald Trump) చేసిన అరాచకాల జాబితా చూస్తుంటే ఆయనకు ఇవ్వాల్సింది నోబెల్ కాదు, ‘హేగ్’ అంతర్జాతీయ న్యాయస్థానంలో కఠినమైన శిక్ష. తన అబద్ధాలను పదేపదే నిజాలుగా నమ్మించేందుకు ఆయన ఆడే డ్రామాలు ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఆయన అధికార దాహం, కీర్తి కండూతి ప్రపంచాన్ని స్మశానంగా మార్చకముందే అంతర్జాతీయ సమాజం మేల్కోవాలి.

చరిత్ర క్షమించదు Donald Trump..!

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరి ఒక రాజకీయ క్యాన్సర్ లాంటిది. అది ప్రపంచ శాంతిని లోలోపలే తినేస్తోంది. ఆయన పదేపదే నోబెల్ కోసం విజ్ఞప్తి చేయడం అంటే, మానవత్వాన్ని వెక్కిరించడమే. బాంబుల మోత, టారిఫ్ ల వేధింపులు, అంతర్జాతీయ సంస్థల నిర్వీర్యం.. ఇవే ట్రంప్ మిగిల్చిన వారసత్వం.
ట్రంప్ తన ‘అరాచక’ వైఖరిని మార్చుకోనంత కాలం, ఆయన ప్రపంచానికి ఒక శాపం మాత్రమే. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోటా విద్వేషం, విధ్వంసం మొలకెత్తుతున్నాయి. ఇలాంటి వాడికి నోబెల్ ఇవ్వడం అంటే శాంతి అనే పదానికే అర్థం మార్చేయడం! ట్రంప్.. మీకు నోబెల్ (Nobel) కాదు, చరిత్ర విధించే శిక్షే సరైన పురస్కారం!

Artifical SpudCell creation in Lab
SpudCell : శూన్యం నుండి సృష్టి.. సైన్స్ చరిత్రలోనే మహాద్భుతం!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment