NewsDabba

Tirumala Ghee : దైవం సాక్షిగా దగా.. భక్తుల మనోభావాలతో జూదం!

Updated on: February 7, 2026 | By Editorial Team

Tirumala Ghee : కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) క్షేత్రం నేడు రాజకీయ చదరంగంలో పావుగా మారింది. పవిత్రమైన ‘శ్రీవారి లడ్డూ’ (Tirumala Laddu) చుట్టూ అల్లుకున్న కల్తీ నెయ్యి (Tirumala Ghee) వ్యవహారం, దాని వెనుక ఉన్న కుంభకోణం (Scam) కంటే కూడా.. ఆ వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న పార్టీల తీరు అత్యంత జుగుప్సాకరంగా తయారైంది. తిరుమల ప్రసాదంలో ‘జంతు కొవ్వు’ (Animal Fat) కలిసిందా లేదా అన్న మీమాంస నుంచి, కోట్లాది రూపాయల ‘పామాయిల్ కుంభకోణం’ (palmoil) వరకు సాగిన ఈ ప్రయాణంలో.. భక్తుల విశ్వాసాలు గాలికి కొట్టుకుపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ భక్తుల మనోభావాలను తాకట్టు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయనేది నగ్న సత్యం.

రాజకీయ లబ్ధి కోసం పవిత్రత బలి

తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు (Animal Fat) కలిసిందన్న వార్త వెలుగులోకి వచ్చినప్పుడు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నేరుగా ఈ ఆరోపణలు చేయడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ (CBI) నేతృత్వంలో జరిగిన విచారణ అనంతరం వెలువడిన ఛార్జ్ షీట్ ఈ వ్యవహారానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. ల్యాబ్ నివేదికల్లో ‘జంతు కొవ్వు’ (Animal fat) ఆనవాళ్లు సాంకేతికంగా నిరూపితం కాలేదని సిబిఐ పేర్కొనడం ఒక ఎత్తయితే, దాని స్థానంలో దాదాపు 60 లక్షల కిలోల కెమికల్ కలిసిన పామాయిల్ (palm oil), నెయ్యి పేరిట సరఫరా అయిందని, దీని వెనుక రూ. 251 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని వెల్లడించడం మరో ఎత్తు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కల్తీ జరిగింది వాస్తవం. అది జంతు కొవ్వు అయినా, తక్కువ రకం పామాయిల్ అయినా.. భక్తుడికి అందే ప్రసాదం అపవిత్రం అయ్యిందనేది నిర్వివాదాంశం. కానీ, మన రాజకీయ పార్టీలు ఈ అపవిత్రతను ప్రక్షాళన చేయడం కంటే, ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Freebies vs Welfare
Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!

YCP ‘క్లీన్ చిట్’ డ్రామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీరు ఈ వ్యవహారంలో అత్యంత విడ్డూరంగా ఉంది. సిబిఐ నివేదికలో ‘జంతు కొవ్వు’ (Animal Fat) లేదని తేలగానే, తాము గంగాజలంతో కడిగిన ముత్యాలమని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యేక హోమాలు, ప్రాయశ్చిత్త పూజలు చేస్తూ రాజకీయ యుద్ధానికి దిగారు. కానీ, ఒక్కసారి వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
కుంభకోణంపై మౌనం ఎందుకు?: జంతు కొవ్వు లేదని సంబరాలు చేసుకుంటున్న వైసీపీ (YCP), 60 లక్షల కిలోల కల్తీ పామాయిల్ (palm oil) సరఫరా గురించి ఎందుకు మాట్లాడటం లేదు? రూ. 251 కోట్ల దోపిడీ మీ హయాంలోనే కదా జరిగింది?
నాణ్యతపై నిర్లక్ష్యం ఎవరిది?: నెయ్యి ధర కంటే తక్కువకు టెండర్లు కోట్ చేసిన కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కల్తీకి మార్గం సుగమం చేసింది మీ ప్రభుత్వం కాదా?
క్షమాపణ లేని అహంకారం: తప్పు జరిగినట్లు సిబిఐ ఛార్జ్ షీట్ సాక్షిగా స్పష్టమవుతున్నా, భక్తులకు కనీసం క్షమాపణ చెప్పే విజ్ఞత వైసీపీకి లేకుండా పోయింది. దానికి బదులు ప్రతికారం తీర్చుకుంటామనే హెచ్చరికలు చేయడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పర్యటనలు, ఆయన అనుచరులైన అంబటి రాంబాబు (Ambati Rambabu), జోగి రమేష్ (Jogi Ramesh) వంటి నేతల వాచాలత చూస్తుంటే.. వారికి భక్తుల మనోభావాల కంటే తమ ‘ఇమేజ్’ కాపాడుకోవడంపైనే శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది.

పరిణతి ప్రదర్శించని  NDA కూటమి

మరోవైపు, అధికారంలో ఉన్న కూటమి (TDP-JSP-BJP) కూడా ఈ విషయంలో పరిణతి ప్రదర్శించలేకపోయింది. చంద్రబాబు నాయుడు (Chandrababu) అనుభవం ఉన్న నాయకుడు. సిబిఐ (CBI) నివేదిక వచ్చిన తర్వాత.. “అప్పట్లో ఎన్డీడీబీ (NDDB) రిపోర్ట్ చూసి నేను ఆందోళన చెందాను, ఇప్పుడు జంతు కొవ్వు లేదని తేలడం సంతోషకరం.. కానీ ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిని వదిలిపెట్టను” అని ఒక హుందాతనమైన ముగింపు ఇచ్చి ఉండాల్సింది. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు.
జంతు కొవ్వు అంశాన్ని సాగదీయడం: సిబిఐ నివేదికను పక్కన పెట్టి, ఇంకా జంతు కొవ్వు అంశాన్నే పట్టుకుని వేలాడటం ద్వారా ప్రభుత్వం తన విశ్వసనీయతను తానే తగ్గించుకుంటోంది.
ఏకసభ్య కమిషన్లు ఎందుకు?: అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తామనడం కేవలం కాలయాపనకే తప్ప, నిజాలు తేల్చడానికి కాదు. ఇది కేవలం వైసీపీని ఇరకాటంలో పెట్టడానికి వాడుతున్న అస్త్రంగానే కనిపిస్తోంది.
అయోధ్య లడ్డూల అంశం: అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యి ఉండవచ్చని ప్రచారం చేయడం ద్వారా సనాతన ధర్మంపై ఉన్న గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నట్లయింది.

నలిగిపోతున్న భక్తుల విశ్వాసం

ఈ రాజకీయ రొచ్చులో సామాన్య భక్తుడు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నాడు. శ్రీవారి లడ్డూ అంటే కేవలం ఒక తినుబండారం కాదు, అది ఒక పరమ పవిత్రమైన నమ్మకం. లక్షలాది మంది భక్తులు ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని ఆరగిస్తారు. అటువంటి ప్రసాదంలో కెమికల్స్ కలిసిన పామాయిల్ వాడటం అనేది క్షమించరాని నేరం. అది చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులే.

Jogi Ramesh Family cheating exposed
Jogi Ramesh: ఆడబిడ్డ జీవితం నాశనం చేసిన ‘జోగి’ ఫ్యామిలీ!

కానీ ఇక్కడ ఏం జరుగుతోంది?
వైసీపీ: “మేము జంతు కొవ్వు కలపలేదు, కాబట్టి మేము పవిత్రులం” అని వాదిస్తోంది. మరి ఆ కుంభకోణం సంగతేంటి?
NDA కూటమి: “జంతు కొవ్వు ఉందని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం” అంటూ రాజకీయాన్ని సజీవంగా ఉంచాలని చూస్తోంది.
ఈ రెండు పార్టీల మధ్యలో భక్తుల మనోభావాలు ఒక ఫుట్‌బాల్‌లా మారాయి. భక్తులకు కావలసింది జంతు కొవ్వా లేక పామాయిలా అనే సాంకేతిక అంశాలు కాదు.. పవిత్రమైన క్షేత్రంలో అపవిత్రమైన పనులు ఎందుకు జరిగాయి? బాధ్యులు ఎవరు? వారిపై తీసుకునే కఠిన చర్యలేంటి? అన్నదే ముఖ్యం.

Tirumala Ghee – శిక్ష వేయాల్సింది శ్రీనివాసుడే!

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. కానీ తిరుమల విషయంలో దేవుడినే రాజకీయ పావుగా మార్చడం ఘోరమైన అపచారం. వైసీపీ (YCP) చేసిన ‘బ్లండర్’కు కుంభకోణం సాక్ష్యమైతే, కూటమి చేస్తున్న ‘మిస్టేక్’ ఆ అంశాన్ని అనవసరంగా రాజకీయం చేస్తూ సాగదీయడం.
తిరుమల కొండపై అధికారం శాశ్వతం కాదు. వేంకటేశ్వర స్వామి కోనేటి రాయుడు. ఆయన సన్నిధిలో అన్యాయం జరిగినప్పుడు మానవ మాత్రులు వేసే శిక్షల కంటే, ఆ దైవం ఇచ్చే శిక్ష చాలా బలంగా ఉంటుంది. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ఏ పార్టీకైనా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది.
ఇప్పటికైనా రెండు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు మాని.. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. తిరుమల ప్రసాదం తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించేలా శాశ్వత పరిష్కారాలు చూపాలి. దేవుడి పేరుతో ఓట్లు అడగడం ఆపి, దేవుడికి భయపడి పరిపాలన చేయడం నేర్చుకోవాలి. భక్తుల కన్నీళ్లకు, ఆవేదనకు కారణమైన వారెవరైనా సరే.. వారు ఆ గోవిందుడి ఆగ్రహానికి గురికాక తప్పదు.

ఇది కూడా చదవండి: https://newsdabba.com/tirumala-ghee-fake-ghee-scam-exposed-by-sit/

YS Jagan
YS Jagan: అన్యాయానికి అండగా నిలబడడమే జగన్ రాజకీయామా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment