NewsDabba

SVSN Varma: రాజకీయ బలిపీఠంపై పిఠాపురం ‘వర్మ’!

SVSN Varma: రాజకీయం అంటేనే అవకాశవాదం. అక్కడ కృతజ్ఞతలకు చోటు లేదు, కేవలం అవసరాలకే పెద్దపీట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ (SVSN Varma) ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సత్యం మరోసారి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. సొంత గడ్డపై శత్రువులతో కంటే మిత్రపక్షాల నుంచే అవమానాలు ఎదుర్కొంటూ, అటు అధినేత ఆదరణకు నోచుకోక, ఇటు మిత్రపక్షం గుర్తింపునకు దక్కక వర్మ అనుభవిస్తున్న రాజకీయ నరకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్.

నాయకుడి కోసం పోరాటం.. నాయకుడి నుంచే హెచ్చరిక!

పిఠాపురంలో (Pithapuram) ఇటీవల జరిగిన ఒక సంఘటన వర్మ రాజకీయ జీవితంలో అత్యంత విషాదకరమైన మలుపుగా నిలుస్తుంది. అది ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఫోటో అక్కడ ఉండాలి. తెలుగుదేశం పార్టీ (TDP) కేడర్ తరపున, ఒక సీనియర్ నాయకుడిగా వర్మ ఆ ఫోటో కోసం పట్టుబట్టారు. అది ఆయనకు తన నాయకుడిపై ఉన్న అచంచలమైన అభిమానం. కానీ, ఫలితం? జనసేన (Janasena) కేడర్ తో ఘర్షణ, ఉద్రిక్తత.

దురదృష్టం ఏంటంటే, తన ఫోటో కోసం పోరాడిన వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  (Chandrababu)వెనకేసుకురాకపోగా, “మీదే తప్పు” అంటూ క్లాస్ పీకడం గమనార్హం. ఒక కార్యకర్త లేదా క్షేత్రస్థాయి నాయకుడు తన అధినేత గౌరవం కోసం నిలబడినప్పుడు, ఆ అధినేతే బహిరంగంగా హెచ్చరించడం వర్మకు కోలుకోలేని దెబ్బ. చంద్రబాబుకు ఇప్పుడు వర్మ స్వాభిమానం కంటే, పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఉన్న పొత్తు బంధమే ముఖ్యం. రాజకీయ చదరంగంలో ఒక బలమైన పావును కాపాడుకోవడం కోసం, తన కోసం ప్రాణాలిచ్చే బంటును బలి ఇవ్వడానికి కూడా వెనుకాడరనేది ఇక్కడ స్పష్టమవుతోంది.

Freebies vs Welfare
Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!

త్యాగాల పునాదులపై పవన్ గెలుపు.. కానీ గుర్తింపు ఎక్కడ?

గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అక్కడ బలమైన క్యాడర్ ఉన్న వర్మ తన సీటును త్యాగం చేశారు. దశాబ్దాలుగా నమ్ముకున్న నియోజకవర్గాన్ని పవన్ కోసం వదిలిపెట్టడమే కాకుండా, ఆయన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. జనసేన గెలుపులో వర్మ పాత్రను ఎవరూ కాదనలేరు. వైసీపీ (YCP) నుంచి వచ్చిన దొరబాబు వంటి వారికి ఆ లోతులు తెలియకపోవచ్చు కానీ, క్షేత్రస్థాయిలో వర్మ వేసిన పునాదులే పవన్‌కు భారీ మెజారిటీని తెచ్చిపెట్టాయి.

అయితే, గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. పిఠాపురంలో (Pithapuram) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కేడర్ వర్మను ఏమాత్రం గౌరవించడం లేదు. తరచుగా ఘర్షణలు జరుగుతున్నా, తన కోసం సీటు వదులుకున్న నాయకుడికి మద్దతుగా పవన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. “వర్మతో గొడవలొద్దు.. ప్రోటోకాల్ పాటించండి” అని తన అనుచరులకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ పవన్ మౌనం వర్మ పట్ల ఆయనకున్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోందా లేక నియోజకవర్గంలో వర్మ ఆధిపత్యాన్ని పూర్తిగా తొలగించాలనే వ్యూహమా?

రెండు పవర్ సెంటర్లు.. అధిష్టానం భయం!

వర్మకు ఎమ్మెల్సీ (MLC) ఇచ్చి గౌరవిస్తారని ఆయన అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ రాజకీయ విశ్లేషణలు మాత్రం మరోలా ఉన్నాయి. పిఠాపురంలో వర్మకు (SVSN Varma) ఎమ్మెల్సీ పదవి ఇస్తే, అక్కడ రెండు ‘పవర్ సెంటర్లు’ తయారవుతాయి. ప్రస్తుతం అక్కడ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. వర్మకు పదవి ఇస్తే ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారు, అప్పుడు జనసేన ఆధిపత్యానికి గండి పడుతుంది.

అందుకే చంద్రబాబు నాయుడు (Chandrababu) కూడా వర్మ విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) కాదని, వర్మను అక్కడ పవర్ సెంటర్‌గా మార్చడం అధిష్టానానికి అస్సలు ఇష్టం లేదు. అందుకే మొన్న అసెంబ్లీ సీటు విషయంలో జరిగినట్లే, రేపు ఎమ్మెల్సీ విషయంలో కూడా వర్మకు నిరాశే మిగిలేలా ఉంది. వర్మ రాజకీయంగా నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ.

Jogi Ramesh Family cheating exposed
Jogi Ramesh: ఆడబిడ్డ జీవితం నాశనం చేసిన ‘జోగి’ ఫ్యామిలీ!

SVSN Varma ముందున్న దారి ఏది?

ప్రస్తుత పరిస్థితులు వర్మకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఆయన అరిచి గీపెట్టినా, గొడవలు చేసినా అది ఆయనకే నష్టం చేకూరుస్తుంది. చంద్రబాబు (Chandrababu) దృష్టిలో ఆయన ఒక ‘సమస్య’గా మారుతున్నారు తప్ప, ‘బలం’గా కనిపించడం లేదు.
అవసరాల రాజకీయం: చంద్రబాబుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యం. అందుకోసం వర్మ వంటి వందమందిని త్యాగం చేయడానికి ఆయన సిద్ధం.
పవన్ సైలెన్స్: తన నియోజకవర్గంలో తనకంటే బలమైన మరో నాయకుడు ఉండకూడదనేది పవన్ కల్యాణ్ అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే వర్మ అవమానాలపై ఆయన మౌనం వహిస్తున్నారు.
నిస్సహాయత: సొంత పార్టీలో గౌరవం లేదు, మిత్రపక్షంలో స్థానం లేదు. వర్మ ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Andhra’s Gold Mine: ఆంధ్రాలో బంగారు కొండ.. తవ్వుకుందామా?

వర్మ గారూ.. మీరు మీ నాయకుడి కోసం పడుతున్న ఆవేదన, ఆరాటం చూస్తుంటే జాలి కలుగుతోంది. కానీ రాజకీయాల్లో ‘సెంటిమెంట్’ కంటే ‘ఇన్వెస్ట్మెంట్’ కే విలువ ఎక్కువ. మీరు చేసిన త్యాగం ఒక పెట్టుబడిగా మిగిలిపోయింది తప్ప, అది మీకు లాభాలను తెచ్చిపెట్టడం లేదు. పవన్ కల్యాణ్ అవసరాల ముందు మీరు ఒక చిన్న ‘పీ నట్’ లాంటి వారు మాత్రమే.

వచ్చే ఎన్నికల వరకు మీకు ఈ ఎదురుచూపులు, అవమానాలు తప్పవు. ఎమ్మెల్సీ (MLC) సీటు దక్కుతుందనే భ్రమల నుంచి బయటపడటం మంచిది. ఇప్పుడు మీరు చేయగలిగిందల్లా ఒక్కటే.. సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం. సరైన సమయం వచ్చినప్పుడు, మీ అస్థిత్వాన్ని చాటుకోవడానికి మరో దారి వెతుక్కోక తప్పదు. అప్పటి వరకు ఓపిక పట్టడమే మీకు మిగిలిన ఏకైక మార్గం.

YS Jagan
YS Jagan: అన్యాయానికి అండగా నిలబడడమే జగన్ రాజకీయామా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రయోజనాల వేటలో వర్మ (SVSN Varma) వంటి నిబద్ధత గల నాయకులు బలిపశువులు కావడం ప్రజాస్వామ్య వైపరీత్యం!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment