NewsDabba

Umar Nabi : డాక్టర్‌ ఉమర్‌ నబీ.. వాడో సైతాన్..! వాడు వాడింది కూడా సైతానే..!

Updated on: November 16, 2025 | By Editorial Team

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల సూత్రధారి, సూసైడ్‌ బాంబర్‌ ఉమర్‌ నబీ మామూలోడు కాదు. వాడి వెనక కథ తవ్వుతుంటే మైండ్‌ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ సైతాన్‌ గాడు మదర్‌ ఆఫ్‌ సైతాన్‌గా చెప్పే పేలుడు పదార్ధాలతో ఢిల్లీ మొత్తాన్ని లేకుండా చేసేందుకు కుట్ర పన్నాడు. ఓ తెలుగు ఐపీఎస్‌ ఆఫీసర్‌ పుణ్యమా అని అది ఆగింది కానీ లేకపోతే వచ్చే డిసెంబర్‌6న భారత దేశ చిత్రపటంలో సగం లేకుండా చేయాలనేది ఆ ఉగ్రవాది పన్నాగం….

మదర్‌ ఆఫ్‌ సైతాన్…!

ట్రయాసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌… అత్యంత ప్రమాదకర పేలుడు పదార్ధం. దాని తీవ్రత కంటే అది పేలే విధానమే అత్యంత ప్రమాదకరం. ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తుందో దానికే తెలియదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ బాంబు తయారీదారులు దీన్ని భయంగానే అయినా ఇష్టంగా వాడుతుంటారు. టైమర్‌లు అవసరం లేదు…. డిటోనేటర్‌ అక్కర్లేదు… చిన్న కుదుపు చాలు… ఓ చిన్నపాటి ఒత్తిడి చాలు పెను విధ్వంసం సృష్టించడానికి…

Beyond the Veil of Marriage: The Battle for Bodily Autonomy
Marital Rape: భార్య శరీరంపై భర్తకు హక్కుందా?

కాస్త వేడి పెరిగినా దానంతట అదే పేలిపోతుంది. 2015 పారిస్‌, 2016 బ్రసెల్స్‌, 2017 బార్సిలోనా, మాంచెస్టర్ పేలుళ్లలో దీన్ని వినియోగించినట్లు గుర్తించారు. ఇప్పుడు ఢిల్లీ పేలుళ్లలో కూడా దీన్ని వాడి ఉంటారని భావిస్తున్నారు.  ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు అంటే మన సైతాన్‌ ఉమర్‌ నబీ… మదర్‌ ఆఫ్‌ సైతాన్‌గా చెప్పే ట్రయాసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌ TATPని ఎర్రకోట పేలుళ్లలో వాడాడని నిఘావర్గాలు గుర్తించాయి.

అన్ని గంటల్లో ఎందుకు పేలలేదు…?

నవంబర్‌10న డాక్టర్‌ నబీ కదలికలను విశ్లేషించేందుకు దర్యాప్తు బృందాలు 5వేల సీసీకెమెరాలను జల్లెడ పట్టాయి. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి ముందు ఉమర్‌… హర్యానాలోని నూహ్‌లో కొన్ని రోజులు ఉన్నట్లు గుర్తించారు. పేలుడుకు ముందు వరకు అతడు అక్కడే ఉన్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. నూహ్‌ నుంచే తన ఐ20కారులో పేలుడు పదార్ధాలతో బయలుదేరాడు నబీ. కొన్ని గంటల పాటు ఢిల్లీ వీధుల్లో తిరిగాడు. సైతాన్ తమ మధ్యే ఉన్నట్లు తెలియని ప్రజలు తాపీగా తమ ఎవరి పనుల్లో వారు పడిపోయారు. చివరకు ఎర్రకోట చేరుకుని సాయంత్రం జన సమర్థం పెరిగే వరకు ఆగి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మరి చిన్న కుదుపుకే పేలే ట్రయాసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌ అన్ని గంటల్లో ఎందుకు విధ్వంసం సృష్టించలేదు అన్నది అతి పెద్ద అనుమానం. మాములుగానే ఢిల్లీ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. అలాంటిది వాడు జర్నీ చేసిన అన్ని గంటల్లో చిన్నపాటి కుదుపు కూడా లేదా…? ఇదే డౌట్‌ మన ఫోరెన్సిక్‌ టీమ్‌కు కూడా వచ్చింది. అయితే వాడు ఎర్రకోట దగ్గర మూడు గంటల పాటు కారులోనే గడిపాడు. ఆ సమయంలోనే ట్రయాసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌, అమ్మోనియం నైట్రేట్‌తో బాంబు తయారు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అప్పటికే ఉమర్‌నబీ టన్నుల కొద్దీ పుస్తకాలు చదివి బాంబు తయారీపై పట్టు సాధించాడు. దాంతో వాడి పని సులువైంది.

The Shocking ₹22,000 Cr Bank Settlement Reality
Subhash Chandra: ప్రజాధనం లూటీకి అడ్డాగా దివాలా చట్టం?!

వాడు వాడింది కూడా సైతానే…!

నిజానికి ఉమర్‌నబీకి తాను ఆత్మాహుతి చేసుకోవడం ఇష్టం లేదు. ఎవరో ఒకరిని ప్రలోభపెట్టి వారిని ఆత్మాహుతి బాంబర్లుగా మార్చాలన్నది వాడి ప్లాన్. అందుకోసం చాలానే వెతికినట్లు లేటెస్ట్‌ న్యూస్. నబీ చనిపోయిన తర్వాత ఈ టెర్రర్‌ మాడ్యూల్‌లో ఉన్న పలువురు డాక్టర్లు నిఘావర్గాలకు చిక్కారు. వారు ఇచ్చిన సమాచారంతో దక్షిణ కశ్మీర్‌లో డానిష్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వాడు చాలా కీలక సమాచారం బయటపెట్టినట్లు సమాచారం. మిగిలిన వారు డానిష్‌ను రిసోర్స్‌గా వాడాలనుకుంటే నబీ మాత్రం సూసైడ్‌ బాంబర్‌గా మార్చాలనుకున్నాడు. ఢిల్లీకి పిలిపించి తన రూమ్‌లో ఉంచుకుని కొన్ని నెలల పాటు మైండ్‌వాష్‌ కూడా చేశాడు. అయితే తనది పేద కుటుంబమని, తన కుటుంబానికి తానే ఆధారమని చెప్పిన డానిష్‌ వెనక్కు తగ్గాడు. దీంతో నబీ మరికొందరికోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో కారులో బాంబులు ఉంచి బాబ్రీ మసీద్‌ కూలిన డిసెంబర్‌6న ఢిల్లీలో పెను విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశాడు. ఈ లోపే ఫరీదాబాద్‌ ఉగ్రకుట్ర బయటపడింది. దీంతో హర్యానాలోని నూహ్‌లో తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో తలదాచుకున్నాడు. అక్కడ్నుంచే  ఎర్రకోటకు చేరుకున్నాడు. అక్కడ తనను తాను సూసైడ్‌ బాంబర్‌గా మార్చుకుని 13మంది ప్రాణాలు తీసుకున్నాడు. ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ చూస్తుంటే ఇన్ని రోజులు నిఘా వర్గాలు నిద్రపోయాయా అన్న డౌట్‌ వస్తోంది. కశ్మీర్‌లో తీగ కదలకపోయి ఉంటే ఆ 3వేల కేజీల పేలుడు పదార్ధాలతో ఢిల్లీలో ఎంత భాగం లేచిపోయేదో ఊహించొచ్చు…!

Kriti Sanon Rakhi Ad Controversy
Kriti Sanon Rakhi Ad: సంస్కృతి పరిరక్షణా? సంకుచిత రాజకీయమా?
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment