NewsDabba

Daggupati Prasad : టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాల పరంపర!

Daggupati Prasad: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం (Anantapur) జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పౌరుషాలకు, రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఈ గడ్డపై, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, అనంతపురం అర్బన్ (Anantapur Urban) నియోజకవర్గంలో నేడు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా తయారైంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే వివాదాలకు కేంద్రబిందువుగా మారడం, ఆయన చుట్టూ ఉన్న అనుచరులు సాగిస్తున్న అరాచకాలు (Controversy) ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggupati Prasad) తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు (Controversy) కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కావు, అవి ఒక వ్యవస్థాగతమైన పతనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

అధికార మదమా? వ్యవస్థలపై నిర్లక్ష్యమా?

గతేడాది మే నెలలో జరిగిన జడ్పీ సమావేశం ఘటన ఎమ్మెల్యే ప్రసాద్ (Daggupati Prasad) రాజకీయ ప్రస్థానంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఒక మహిళా ప్రజాప్రతినిధి, పైగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హోదాలో ఉన్న గిరిజమ్మ వ్యక్తిగత గదిలోకి బలవంతంగా చొరబడటం ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలిపెట్టు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో ఉందనే నెపంతో ఆమెను అసభ్య పదజాలంతో దూషించడం (Controversy) ఆయన సంస్కారాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ వైరి వర్గాల పట్ల విమర్శలు ఉండవచ్చు, కానీ ఒక మహిళా నాయకురాలి పట్ల ప్రదర్శించిన ఆ అహంకారం, అధికార గర్వానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ఘటన అప్పట్లోనే జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

Amaravati - AP Capital
Amaravati : అమరావతిని ఎవరొచ్చినా మార్చలేరా..?

Jr.NTR ఫ్యాన్స్ తో గొడవ

రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సింది పోయి.. సినిమా రంగంపై.. ముఖ్యంగా స్టార్ హీరోలపై వ్యక్తిగత కక్షలు పెంచుకోవడం విడ్డూరంగా ఉంది. గతేడాది ఆగస్టులో విడుదలైన ఆడియో క్లిప్ (Viral Audio) ఎమ్మెల్యే ప్రసాద్ (Daggupati Prasad) అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను (Jr.NTR) ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దూషణలే (Controversy) కాదు.. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. వార్ 2 సినిమాను అనంతపురంలో ఆడనివ్వబోమని బెదిరించడం ద్వారా ఆయన తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వ్యవహారం చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) జోక్యం చేసుకునే వరకు వెళ్లడం, ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడం చూస్తుంటే, ఆయన వైఖరి పార్టీ ప్రతిష్టను ఏ విధంగా దెబ్బతీస్తోందో అర్థం చేసుకోవచ్చు.

గన్‌మెన్ల గూండాయిజం – వసూళ్ల దందా

ఒక ఎమ్మెల్యేకు రక్షణగా ఉండాల్సిన గన్‌మెన్లు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వసూల్ రాజాలుగా మారడం దేనికి సంకేతం? ఈ నెల 13న అనంతపురం (Anantapur) ఎగ్జిబిషన్ వద్ద గన్‌మెన్ షేక్ షా చేసిన హల్‌చల్ సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 10 లక్షల రూపాయల మామూలు ఇవ్వలేదన్న కోపంతో నిర్వాహకులపై దాడి చేయడం చూస్తుంటే, దీని వెనుక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. గన్‌మెన్ కేవలం ఒక ముసుగు మాత్రమేనని, అసలు సూత్రధారి ఎమ్మెల్యేనే అన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చాక పోలీసులు అతడిని సస్పెండ్ చేసినా, బాధితులకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు?

మహిళా యజమానిపై అసభ్య పదజాలం – Viral Audio

ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ప్రసాద్‌కు (Daggupati Prasad) సంబంధించి బయటకు వచ్చిన మరో ఆడియో క్లిప్ (Viral Audio) ఆయన నైతికతను ప్రశ్నిస్తోంది. అనంతపురం (Anantapur) పట్టణంలోని ఆస్రా కళ్ల అద్దాల దుకాణానికి సంబంధించిన భూ వివాదంలో తలదూర్చిన ఎమ్మెల్యే, సదరు దుకాణ మహిళా యజమాని పట్ల అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మహిళలతో మాట్లాడే కనీస సంస్కారం కూడా లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

YS Jagan Mittal
YS Jagan: మిత్తల్ స్టీల్ ప్లాంట్: క్రెడిట్ చోర్ ఎవరిది?

దండుపాళ్యం ముఠా పనేనంటున్న Daggupati Prasad

తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) మీడియా ముందు ఘాటుగా స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి గతం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ముడుపులు తీసుకుని నేషనల్ హైవేని వంకరగా తిప్పిన చరిత్ర మీదేనని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు దండుపాలెం ముఠాగా మారి తనపై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఎగ్జిబిషన్ వద్ద చిన్న గొడవ జరిగితే అసత్య ప్రచారం చేస్తున్నారని దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు. తమ అనుచరులను రక్తం వచ్చేలా కొట్టారని విమర్శించారు. ఇక లింగాయత్ చైర్‌పర్సన్ స్వప్న స్థలం వివాదంతో నాకు సంబంధం లేదన్నారు.

అధిష్టానం మౌనం వెనుక మర్మమేంటి?

తెలుగుదేశం పార్టీ (TDP) ఎప్పుడూ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యవహారశైలి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదన్న చందంగా, జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలపై రాని ఆరోపణలు కేవలం ప్రసాద్‌పైనే ఎందుకు వస్తున్నాయి? ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నకు పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన సమయంలో, నిత్యం గొడవలు, పోలీస్ స్టేషన్ కేసులు, ఆడియో క్లిప్పింగులతో (Viral Audio) వార్తల్లో నిలవడం అనంతపురం ప్రజల దురదృష్టం.

ప్రజాస్వామ్యంలో ఓటు వేసి గెలిపించిన ప్రజలే సుప్రీం. అధికారంలో ఉన్నామనే అహంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, మహిళలను గౌరవించకపోవడం, వ్యాపారస్తులను వేధించడం వంటి పనులు ఏ ప్రజాప్రతినిధికీ తగవు. దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) తన తీరును మార్చుకోకపోతే, భవిష్యత్తులో ప్రజలే ఆయనకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రభుత్వం, పార్టీ అధిష్టానం తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. లేదంటే, ఒక వ్యక్తి చేసే తప్పుల వల్ల మొత్తం ప్రభుత్వంపైనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అనంతపురం అర్బన్ ప్రజలు కోరుకునేది అభివృద్ధిని, ప్రశాంతతను.. కానీ ఎమ్మెల్యే ప్రసాద్ ఇస్తున్నది వివాదాలను, భయాందోళనలను. ఈ పరిస్థితి మారాలంటే కఠిన చర్యలు అనివార్యం.

Film city in amaravati
Film City: ఏపీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment