NewsDabba

Indo Russia Deal : భారత్‌ – రష్యా మధ్య గేమ్‌ ఛేంజర్‌ డీల్..!?

Updated on: December 24, 2025 | By Editorial Team

Indo Russia Deal: అమెరికా అండతో కాలరెగరేస్తున్న పాక్‌కు గట్టి షాక్‌ తగిలింది. భారత్ నమ్మకమైన నేస్తం రష్యా… భారత్‌ వాయిసేనకు బూస్ట్‌ ఇచ్చే సిగ్నల్‌ ఇచ్చింది. ఐదోతరం ఫైటర్‌ జెట్స్‌ను అందించడమే కాదు టెక్నాలజీని కూడా ఇస్తామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. దీనికి పెట్టిన టర్మ్స్‌ అండ్ కండిషన్స్‌ కూడా వయబుల్‌గానే ఉన్నాయి. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటి…? అమెరికా అడ్డుపుల్ల వేయదా…?

అగ్రదేశాలన్నీ ప్రస్తుతం ఫిఫ్ట్‌ జనరేషన్‌ ఫైటర్‌ జెట్స్‌ వాడుతున్నాయి. అడ్వాన్స్‌డ్‌ వార్‌ఫేర్‌లో వీటి పాత్ర చాలా కీలకం. కానీ మనం మాత్రం పాతతరం యుద్ధవిమానాలనే వాడుతున్నాం. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌తో పాటు తేజస్‌ వంటి వాటిని నమ్ముకున్నాం. కానీ ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ మాత్రం మనకు అందుబాటులో లేదు. మన పక్కలో బల్లెం లాంటి చైనా ఇప్పటికే ఈ టెక్నాలజీతో ఫైటర్‌ జెట్స్‌ వినియోగిస్తోంది. ఇప్పుడు మనకు ఆ లోటు తీరేలా కనిపిస్తోంది. ఆయుధ సరఫరాలో మనకు అత్యంత నమ్మకమైన రష్యా మనకు ఐదోతరం యుద్ధవిమానాలను అందిస్తామన్న సంకేతాలు ఇచ్చింది.

Meta Fined Over Kids Mental Health!
Kids Mental Health: పిల్లల మనస్సులతో ఆట.. మెటాకు రూ.8,967 కోట్ల జరిమానా!

SU-57 స్టెల్త్‌ ఫైటర్స్‌ను మనకు అందిస్తామని రష్యా సిగ్నల్స్‌ ఇచ్చింది. అంతేకాదు దీని టెక్నాలజీని కూడా ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించి రష్యా విధించిన షరతులకు భారత్‌కు పూర్తి ఆమోదయోగ్యంగా ఉన్నాయని తెలుస్తోంది. దుబాయ్‌ ఎయిర్‌షో తర్వాత రష్యా డిఫెన్స్‌ సంస్థ (Indo Russia Deal) రోస్టెక్‌ సీఈఓ సెర్గీ షెమెజోవ్‌ చేసిన వ్యాఖ్యలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. భారత్‌-రష్యాలు సంప్రదాయ భాగస్వాములని, గతంలో భారత్‌పై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ఆయుధాలు సరఫరా చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ముందుకెళతామని, భారత్‌ సైనిక అవసరాలను తీర్చడానికి తాము ముందుంటామన్నారు. ఇదే సంస్థ సబ్సిడరీ యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వాదిమ్‌ బడేకా మాత్రం నేరుగానే స్పందించారు. Su-57కు సంబంధించి భారత్‌ సాంకేతిక అవసరాల సమాచారం తమకు అందిందన్నారు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. డిఫెన్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ సమాచారం ప్రకారం చూస్తే రష్యాలోనే వీటిని తయారుచేసి భారత్‌కు అప్పగిస్తారు. ఇంజన్లు, AESA రాడార్లు, ఆప్టిక్స్‌, సిగ్నేచర్‌ టెక్నాలజీత్‌తో పాటు లైసెన్సింగ్‌. ఎయిర్‌ వెపన్స్‌ ఇంటిగ్రేషన్‌ కూడా ఇస్తారు. దీనివల్ల కొన్ని క్రిటికల్‌ కాంపొనెంట్స్‌ను ఇండియాలోనే నేరుగా తయారుచేసుకోవచ్చు. విదేశీ ఆంక్షల ప్రభావం ఉండబోదు. సాఫ్ట్‌వేర్ అందించడమే కాదు దాని అప్‌డేట్స్‌ కూడా ఎప్పటికప్పుడు అందిస్తామని రష్యా హామీ ఇస్తోంది. వచ్చేనెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇండియాకు రాబోతున్నారు. ఈ సమయంలో ఇలాంటి సంకేతాలు రావడం ఆసక్తికకరంగా మారింది.

Su-57 స్పెషాలిటీస్‌ ఏంటి…?

2010లో దీన్ని తొలిసారి ప్రయోగించి చూశారు. తర్వాత పలుమార్పులు చేర్పులు చేశారు. 2020లో ఇది రష్యా సైన్యంలోకి చేరింది. దీని స్పెషాలిటీలు ఏంటంటే….
* ఫిఫ్త్‌ జనరేషన్‌ మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్‌
* ట్విన్ ఇంజన్‌ స్టెల్త్ జెట్‌, 3D థరస్ట్‌ వెక్టరింగ్ ( అమెరికా F-35కి ఈ సౌకర్యం లేదు)
* సూపర్‌ మాన్యువరలబులిటి, సూపర్‌ క్రూయిజ్‌
* గంటకు 2, 136కిలోమీటర్ల వేగం ( అమెరికా F-35 వేగం 1,931 కిమీ)
* 66వేల అడుగుల ఎత్తువరకు వెళ్లే సౌకర్యం ( చైనా జెట్స్‌ 52వేల అడుగుల వరకే వెళ్లగలవు)
* ఎయిర్‌ టు ఎయిర్‌, ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్‌
* న్యూక్లియర్‌ కేపబుల్‌ మిస్సైల్స్‌ మోసుకెళ్లే సత్తా
* అడ్వాన్డ్స్‌ సెన్సార్స్‌, హైలెవల్‌ ఆటోమేషన్
* రాడార్లను బోల్తా కొట్టించే సత్తా
* ఎయిర్‌ టు ఎయిర్‌ కాంబాట్‌ కోసం ఆరు మిస్సైళ్లు
* భూమిపై టార్గెట్ల కోసం 250కేజీల పేలుడు పదార్ధాలు మోసుకెళ్లే సౌకర్యం…

చైనా ఇప్పటికే J-20, J-35 తరహా ఫైటర్‌ తర్వాతి తరం ఫైటర్‌ జెట్లను వాడుతోంది. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. సిక్స్త్‌ జనరేషన్‌పై కూడా ఫోకస్‌ పెట్టింది. మనం ఇంకా ఐదో తరం తయారీలో ఉన్నాం. మన దగ్గర దాని మొదటి ప్రోటోటైప్ రెడీ కావడానికి మరో ఐదారేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత అది పరీక్షలన్నీ పాసై, ఆమోదం పొంది సైన్యంలోకి ప్రవేశపెట్టే సరికి మరో దశాబ్దం పడుతుంది. ప్రస్తుతం పాక్‌, చైనా, బంగ్లాదేశ్‌ రూపంలో మన సరిహద్దుల్లో శత్రువులు కాచుకు కూర్చున్నారు. ఈ సమయంలో మన వైమానిక సామర్ధ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రష్యా మనకు అందించే ఈ సాంకేతికత మనం శత్రువులను గట్టిగా ఎదుర్కోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. పాక్‌ కూడా చైనా, అమెరికా నుంచి యుద్ధవిమానాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి మనకు రష్యాతో డీల్‌ కుదిరితే మనం ఓ అడుగు ముందుంటాం.

Gen Z Economic Inequality
Gen Z: జెన్ జీ పోరాడాల్సింది ఇలాంటి వాటి పైనే కదా?

F-35 కొనాలా లేక Su-57 తీసుకోవాలా…?

నిజానికి ఈ యుద్ధవిమానాలు సప్లయ్‌ చేస్తామని రష్యానే ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ F-35 యుద్ధవిమానాలు కోరుకుంటే అందిస్తామన్నారు. అయితే ఆయన వ్యాపార కోణంలో ఈ ఆఫర్ ఇచ్చారు. కానీ రష్యా మాత్రం నమ్మకమైన భాగస్వామ్యం కోణంలో ముందుకొచ్చింది. అయితే అమెరికా యుద్ధవిమానాలు మాత్రమే సరఫరా చేస్తుంది. దానికి కూడా సవాలక్ష ఆంక్షలుంటాయి. అదే సమయంలో సాంకేతికను మాత్రం బదలాయించదు. కానీ రష్యా మాత్రం టెక్నాలజీని పూర్తిగా అందించేందుకు సిద్ధం అంటోంది.

సౌదీతో యూఎస్‌ డీల్‌.. భారత్‌కు టెన్షన్ (Indo Russia Deal)

అమెరికా మనకు ఆఫర్ ఇచ్చినా సౌదీ అరేబియాతో F-35 యుద్ధవిమానాల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ దగ్గర మాత్రమే F-35లు ఉన్నాయి. ఇటీవల పాక్‌తో సౌదీ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంతో ఇది భారత్‌ను కలవరపెడుతోంది. మనం పాక్‌పై దాడి చేస్తే సౌదీ దాన్ని తమపై జరిగిన దాడిగానే గుర్తించాలన్నది వాటి మధ్య కుదిరిన ఒప్పందం. ఇప్పుడు సౌదీ దగ్గర F-35 యుద్ధవిమానాలు ఉంటే ఓ రకంగా పాక్‌ దగ్గర ఉన్నట్లే. అందుకే భారత్‌ సాధ్యమైనంత వేగంగా ఐదో తరం యుద్ధవిమానాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో రష్యా డీల్‌ మనకు కొత్త ఊపిరినిచ్చినట్లే.

అమెరికా ఊరుకుంటుందా…?

ఎప్పట్లానే అమెరికా దీనికి మోకాలడ్డే అవకాశాలు లేకపోలేదు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చూపుతూ రష్యాతో డీల్‌ (Indo Russia Deal) కుదుర్చుకుంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరించొచ్చు. దీంతో పాటు ఇతర ఆయుధ సరఫరాను నిలిపివేసే అవకాశాలున్నాయి. పాక్‌కు మరింత దగ్గరగా జరగొచ్చు. అయితే భారత్‌ మాత్రం సైనిక అవసరాలు, సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రువులను దృష్టిలో పెట్టుకుని రష్యాతో డీల్‌కే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Anglo Mysore War
Anglo Mysore War : మైసూర్ వీరులు.. అమెరికా స్వాతంత్ర్య సమరంలో వ్యూహకర్తలు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment