NewsDabba

Caste Card : అధికారంలో అహంకారం.. ఆపదలో ‘అస్తిత్వ’ వాదం!

Caste Card : రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉండి, చట్టాన్ని రక్షించాల్సిన వారే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఒక ఎత్తైతే.. తీరా తమ పాపాలు పండి విచారణను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ‘కులం, మతం, ప్రాంతం’ కార్డులను (Caste Card) ప్రయోగించడం అంతకంటే పెద్ద నేరం. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ (Sunil Naik) ఉదంతం ఇప్పుడు ఇదే చర్చను దేశవ్యాప్తంగా లేవనెత్తుతోంది.

బాధ్యత మరిచిన ‘బలవంతులు’

ఐపీఎస్ (IPS).. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వీసుల్లో ఒకటి. శాంతిభద్రతలను కాపాడటం, సామాన్యుడికి న్యాయం అందించడం ఈ అధికారుల ప్రాథమిక విధి. కానీ, దురదృష్టవశాత్తు కొందరు అధికారులు రాజకీయ యజమానుల ప్రాపకం కోసం చట్టాన్ని తుంగలో తొక్కి, వారి కనుసన్నల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమ మాటే శాసనమని, తమను ఎవరూ ప్రశ్నించలేరని విర్రవీగుతుంటారు. రఘురామకృష్ణరాజు (RRR) కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ (Sunil Naik) తీరు దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి తన పరిధిని దాటి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చినప్పుడు, నిష్పక్షపాతంగా విచారణను ఎదుర్కోవడం కనీస ధర్మం. కానీ, అరెస్ట్ భయం పట్టుకోగానే ఆ అధికారికి తన పదవి గుర్తుకురాలేదు, తను చేసిన ప్రమాణం గుర్తుకురాలేదు.. కేవలం తన ‘కులం’ మాత్రమే  (Caste Card) గుర్తుకొచ్చింది.

Punarvika - 16 Crores Injection
Punarvika : పసిపాప ప్రాణం ఖరీదు రూ.16 కోట్లు

ఇది కూడా చదవండి: Seven Hills : తిరుమల ఏడుకొండల వివాదం… వైసీపీ, టీడీపీలలో ఎవరు నిజం?

Caste Card : ఆత్మరక్షణో.. అపహాస్యమో?

సునీల్ నాయక్ (Sunil Naik) చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. “నేను ఎస్టీగా పుట్టడమే నా నేరమా? చిన్న కులాల వారు ఉన్నత పదవుల్లో ఉండటం భరించలేరా?” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే.. ఆయన ఏ సాధారణ కానిస్టేబులో లేక కింది స్థాయి ఉద్యోగో కాదు. ఆయన ఒక డి.ఐ.జి (DIG) హోదాలో ఉన్న అధికారి.

sunilnaik-castepost
sunilnaik-castepost

ఒక రాష్ట్రంలో వేళ్ళ మీద లెక్కించదగిన అతి కొద్దిమందికి మాత్రమే లభించే అత్యున్నత హోదా అది. వందలాది మంది పోలీసులు ఆయన కనుసైగల్లో పనిచేస్తారు. అపారమైన అధికారాలు, గౌరవం కలిగిన వ్యక్తి, తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక, “నేను ఎస్టీని కాబట్టే నన్ను వేధిస్తున్నారు” అనడం అస్తిత్వ రాజకీయాలను ఎంతగా దిగజార్చవచ్చో చూపిస్తోంది.

Tirumala Seven Hills - AI Generated
Seven Hills : తిరుమల ఏడుకొండల వివాదం… వైసీపీ, టీడీపీలలో ఎవరు నిజం?

వివక్ష కాదు.. అక్రమాలపై అస్త్రం!

నిజంగానే దళితులు, గిరిజనులు, మైనారిటీలు సమాజంలో వివక్షకు గురవుతుంటారు. కింది స్థాయిలో ఉన్న కానిస్టేబుల్ లేదా సామాన్య పౌరుడు తన అస్తిత్వం కారణంగా వేధింపులకు గురైతే అది సామాజిక వివక్ష. కానీ, డిఐజి స్థాయిలో ఉండి, వ్యవస్థలనే శాసించగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం.
ఒకవేళ కేవలం గిరిజన లేదా బలహీన వర్గాల అధికారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అనుకుందాం.. మరి ఏపీలో ఇదే తరహా కేసుల్లో అరెస్ట్ అయి, సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాలు గున్నీ వంటి అధికారుల పరిస్థితి ఏమిటి?. సీతారామాంజనేయులు ఆయన అగ్రకులానికి చెందిన వ్యక్తి, డీజీపీ స్థాయి అధికారి. మరి ఆయనపై చర్యలు తీసుకున్నప్పుడు లేని ‘వివక్ష’, సునీల్ నాయక్ విషయంలోనే ఎలా పుట్టుకొచ్చింది? ఇది కేవలం కేసుల నుంచి దృష్టి మరల్చడానికి, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఆడే ‘విక్టిమ్ కార్డ్’.

ఇది కూడా చదవండి: Punarvika : పసిపాప ప్రాణం ఖరీదు రూ.16 కోట్లు

వ్యవస్థలకు చేటు.. జెన్యూన్ బాధితులకు అన్యాయం

సునీల్ నాయక్ (Sunil Naik) వంటి ఉన్నత స్థాయి అధికారులు ఇలాంటి కులం రంగును పులుముకోవడం వల్ల సమాజానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు.
విచారణ నీరుగారడం: అసలు నేరం ఏమిటి? ఏ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి? అనే అంశాల కంటే కుల పోరాటాలకే మీడియాలో ప్రాధాన్యత లభిస్తుంది. దీనివల్ల అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది.
నిజమైన బాధితులకు నష్టం: నిజంగా కుల వివక్ష ఎదుర్కొంటున్న సామాన్యుల వాణి వినపడకుండా పోతుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా ఈ కార్డును (Caste Card) వాడుతుంటే, రేపు నిజమైన బాధితులు మొరపెట్టుకున్నప్పుడు సమాజం వారిని ‘సినికల్’ (Cynical) గా చూసే ప్రమాదం ఉంది.
సర్వీసుల పరువు బజారున పడటం: ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులే ఇటువంటి సంకుచిత భావజాలంతో మాట్లాడితే, రేపు ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది?

Gopimurthy pdf mlc
Gopimurthy : ‘రూ.లక్ష’ బిచ్చం వద్దన్న ఒకే ఒక్కడు..!!

చట్టం తన పని తాను చేయాలి!

చట్టం ముందు అందరూ సమానులే. కులంతో సంబంధం లేకుండా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే. నిందితుడిగా ఉన్నప్పుడు తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, ముందస్తు బెయిల్ పిటిషన్లు ఉన్నాయి. కానీ, ఏకంగా తన కులాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేయడం అక్షంతవ్యమైన నేరం.

అధికారంలో ఉన్నప్పుడు “చట్టం నా జేబులో ఉంది” అని ప్రవర్తించి, ఆపదలో ఉన్నప్పుడు “నా కులం నా రక్షణ కవచం” (Caste Card) అని చెప్పుకోవడం పిరికితనం మాత్రమే కాదు, అది సామాజిక ద్రోహం కూడా. ఐపీఎస్ అధికారుల నుంచి సమాజం కోరుకునేది బాధ్యతాయుతమైన ప్రవర్తన, కులంతో ముడిపడిన రాజకీయాలు కాదు. ఇప్పటికైనా ఇటువంటి పోకడలను వ్యవస్థలు తీవ్రంగా పరిగణించకపోతే, భవిష్యత్తులో ప్రతి నేరగాడు తన కులమో, మతమో తనకు రక్షణగా మార్చుకునే ప్రమాదం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment