Nobel – Trump : ప్రపంచ రాజకీయాలను తనదైన ప్రసంగాలతో దడదడలాడించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల కల్లగానే మిగిలిపోయింది. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. దీంతో, శాంతి బహుమతి కోసం ఆయన చేసిన అలుపెరగని, అవిశ్రాంత మైక్ శబ్దాలన్నీ మూగబోయాయి. పాపం.. నోబెల్ కమిటీ అగౌరవపరిచిందంటూ ట్రంప్ అభిమానులు, ట్రంప్ స్వయంగానూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ట్రంప్ కు నోబెల్ ఇవ్వలేదంటే.. అది కేవలం ఆయనకు జరిగిన అన్యాయం కాదట! యావత్ ప్రపంచానికే జరిగిన అన్యాయమట..!! శాంతి బహుమతి తనకు దక్కలేదంటే.. మిగిలిన ఎవరికీ ద్కే అర్హత లేదంట..! శాంతి బహుమతి కోసం శాంతియుత పోరాటం చేయాల్సింది పోయి.. రోజూ గొంతెత్తి ఏడుస్తున్నారు. అయినా నోబెల్ కమిటీ మాత్రం మీడియాలో చేసే సౌండ్ లను తాము పట్టించుకోబోమని కమిటీ తేల్చేసింది. దీంతో ట్రంప్ కు మరింత కాలుతోందట..!
ట్రంప్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన నోబెల్ కమిటీ సభ్యులు తీవ్రమైన గందరగోళంలో పడ్డారని అంతర్గత సమాచారం. ఒక సభ్యుడు ఆశ్చర్యపోతూ “ఆయన పేరు ఏ కేటగిరీకి వచ్చిందో చూడండి.. నిజంగా నోబెల్ శాంతి బహుమతికేనా? లేదంటే కొత్తగా ‘గ్రేటెస్ట్ సోషల్ మీడియా నాయిస్ అండ్ ఫ్యూరీ అవార్డ్’ లాంటిదాన్ని ప్రారంభించారా?” అని ప్రశ్నించారట. పాపం.. ట్రంప్..!!
పైగ.. కమిటీ సభ్యులు ట్రంప్ ‘పీస్ పోర్ట్‌ఫోలియో’ను పరిశీలించినప్పుడు.. వాళ్లకు ‘శాంతి’కి సంబంధించిన ఏ అంశమూ దొరకలేదట. బదులుగా వాళ్లకు ఏం దొరికాయో తెలుసా..?
- 3AM ట్వీట్లు :* ఇవి నిద్రపోతున్న ప్రపంచ శాంతిని కూడా నిద్రలేపేంత “శక్తివంతమైనవి”.
- అతి-భారీ ప్రసంగాల టేపులు: ఇందులో డెసిబెల్ స్థాయిలు శాంతికి అవసరమైన స్థాయికి కంటే కొన్ని వేల రెట్లు అధికంగా నమోదయ్యాయట.
- సమావేశాల రికార్డులు: ఇందులో ట్రంప్ మాట్లాడినంత సేపూ, ఇతర దేశాల ప్రతినిధులు తమ చెవిలో దూది పెట్టుకోవడాన్ని ‘శాంతి ప్రయత్నంగా’ కమిటీ పొరబడలేదట.
చివరికి కమిటీ ఒకే ఒక్క నిర్ణయానికి వచ్చిందట… “శాంతికి కావాల్సింది ప్రశాంతత. కానీ ఇక్కడ దొరికింది కేవలం ఉపన్యాసం మాత్రమే. మా బహుమతిని ట్రాఫిక్ జామ్ లో ఇవ్వలేము.” అని తేల్చేసిందట..!!
ట్రంప్ కు నోబెల్ నిరాకరించడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ట్రంప్ శాంతిని పెద్ద గొడవ తర్వాత వచ్చే నిశ్శబ్దంగా నిర్వచించారు. ఆయనే అర్హుడు! అని ఒక అభిమాని “పెద్దగా అరిచి” మద్దతును తెలిపారు.
మరో వర్గం ఏకంగా నోబెల్‌ను బహిష్కరిస్తూ కొత్త నినాదం ఎత్తుకున్నారు: “నోబెల్ వద్దు, మాకు కావాలి #ట్రంప్బెల్!” అంటూ ఎక్స్ లో ట్రెండింగ్ చేశారు.
నోబెల్ తిరస్కరణ ట్రంప్‌ను నిరుత్సాహపరచలేకపోయింది. బదులుగా, ఈ సంఘటన ఆయనకు కొత్త ఆలోచనను ఇచ్చింది: అదేంటంటే.. తన బహుమతికి తానే నిర్ణేతను అని ట్రంప్ తనంతట తానే ప్రకటించుకున్నారట!
రాబోయే సంవత్సరంలో, ట్రంప్ ‘గ్రేట్ అమెరికన్ సెల్ఫ్-పీస్ అండ్ కాన్ఫిడెన్స్ అవార్డ్’ అనే కొత్త బహుమతిని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. మొదటి విజేత ఎవరో ప్రకటించక ముందే ఆయన వెల్లడించారు. “మొదటి విజేత— నేనే.” అని.
ఈ బహుమతి జ్యూరీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. ట్రంప్ ఈ బహుమతికి ఏకైక న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఆయన రోజూ మూడు సమావేశాలు నిర్వహిస్తారు: ఉదయం, సాయంత్రం, రాత్రి. ప్రతి సమావేశంలోనూ, ఆయన తనకే ఓటు వేసుకుని, చివరికి గంభీరమైన ఆత్మవిశ్వాసంతో ఆ అవార్డును స్వయంగా ప్రకటించుకుంటారు.. స్వయంగా స్వీకరిస్తారు.
ఈ విషయంపై యూరోపియన్ నాయకుడొకరు స్పందిస్తూ: “ట్రంప్‌కు శాంతి బహుమతి ఇవ్వడం అంటే, కోపంతో అరిచే సింహానికి జూలో ‘అత్యంత మౌనంగా ఉన్న జంతువు’ అవార్డు ఇవ్వడం లాంటిది,” అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఆసియా దేశాల ప్రతినిధి ఎలా స్పందించారంటే “ఆయన స్పీచ్‌ల తర్వాతే మా దేశంలో శబ్ద కాలుష్య నియమాలను కఠినతరం చేశాం. ఆయన మాకు నిశ్శబ్దం కంటే ఎక్కువ నియమాలను ఇచ్చారు,” అని అన్నారు.
ముగింపులో, నోబెల్ కమిటీ మునుపటి తీర్మానానికే కట్టుబడింది: ఆయన ఫైలును మూసేసి, నిజంగా శాంతిని పాటించే వారి కోసం వెతకడం మొదలుపెటింది.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.





