NewsDabba

Sheikh Hasina : షేక్ హసీనాను భారత్‌ అప్పగిస్తుందా..? ఉరికంబం ఎక్కడం ఖాయమా..?

Updated on: December 24, 2025 | By Editorial Team

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ (Bangladesh) కోర్టు ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు (Sheikh Hasina) ఉరిశిక్ష విధించింది. జాతిపిత కూతుర్ని దేశద్రోహిగా తేల్చింది. మరి ఆమె భవిష్యత్తు ఏంటి…? భారత్‌ ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా…? నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని గౌరవిస్తుందా…?

Epstein Files
Epstein Files: పెద్దోళ్ల బేవర్స్ పనులు..!

ICT ఏమని తీర్పు చెప్పింది?

బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT) బంగ్లా అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్‌ హసీనాను (Sheikh Hasina) దోషిగా తేల్చింది. 453పేజీల జడ్జ్‌మెంట్‌లో పలు సెక్షన్ల కింద ఆమెను దోషిగా ప్రకటించింది. మాజీ మంత్రి అసదుద్‌జమాన్‌ ఖాన్‌ కమాల్‌కు కూడా ఉరిశిక్ష విధించింది కోర్టు. 2024లో జరిగిన అల్లర్లు, 14వందల మంది విద్యార్థుల మరణానికి ఆమె కారణమన్న అభియోగాలను కోర్టు ఆమోదించింది. దీంతో ఆమె దోషిగా తేలారు.

హసీనాను (Sheikh Hasina) భారత్ అప్పగిస్తుందా?

ప్రస్తుతం షేక్‌ హసీనా (Sheikh Hasina) ఢిల్లీలో ఉంటున్నారు. ఓ రహస్య ప్రదేశంలో కొంతమంది సన్నిహితులతో కలిసి ఆమె తలదాచుకున్నారు. బంగ్లా అల్లర్ల సమయంలో కట్టుబట్టలతో దేశం వీడిన హసీనా… ఢిల్లీ శరణుకోరారు. ఆమె పార్టీతో ఉన్న సంబంధాలతో భారత్‌ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. అప్పట్నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇప్పుడు బంగ్లా కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించడంతో ఆమెను ఆ దేశానికి అప్పగిస్తారా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే దాయాదిదేశం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. తమ చట్టాలను గౌరవించాలని… హసీనాను, ఇతరులను అప్పగించాలని మోడీ సర్కార్‌ను కోరింది. ఇరుదేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. దాని ప్రకారం హసీనాను పంపాల్సిందేనన్నది బంగ్లా డిమాండ్‌.. తమ అభ్యర్థనను తిరస్కరిస్తే అది ఇరుదేశాల సంబంధాలను మరింత దిగజారుస్తుందని… శాశ్వత శత్రుత్వం ఏర్పడుతుందని హెచ్చరిస్తోంది.

Balochistan
Balochistan: పాక్ వినాశనం మొదలైందా?

హసీనాపై (Sheikh Hasina) భారత వైఖరేంటి?

బంగ్లాదేశ్‌ డిమాండ్‌ను గౌరవిస్తున్నామంటూనే భారత్‌ ఆచితూచి స్పందించింది. పొరుగుదేశంగా బంగ్లా ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమవంతు సహకరిస్తామని తెలిపింది. అన్ని వర్గాలతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. హసీనాను అప్పగిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. తనకు విధించిన శిక్షను హసీనా తప్పుపట్టారు. తనకు సంబంధం లేని నేరాలకు బాధ్యురాలిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన శిక్షను ఆమె కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లోని ఏ కోర్టులోనూ తనకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఆమె భావిస్తున్నారు. అయితే కొన్నాళ్ల పాటు న్యాయపోరాటం చేస్తే వచ్చే ఏడాది బంగ్లాలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు టైమ్ తీసుకోవచ్చు. ఆ ఎన్నికల్లో హసీనా పార్టీ పోటీ చేసే అవకాశాలు లేవు… అక్కడ ఆ పార్టీని బ్యాన్ చేశారు. అయితే కొంతకాలం ఆగితే పరిస్థితులు మారే అవకాశం ఉందన్నది ఆమె ఆలోచన.

భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

భారత్‌-బంగ్లా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందంలోని ఓ క్లాజ్‌ను ఢిల్లీ రెయిజ్‌ చేసే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో ఎవరినీ అప్పగించమని అడగలేరు. దాన్నే భారత్‌ అడ్డుపెట్టుకునే అవకాశాలున్నాయి. నిష్పాక్షిక విచారణ జరగలేదని భారత్‌ ఆరోపించొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో హసీనాను బంగ్లాకు అప్పగిస్తే యూనస్ ప్రభుత్వం ఆమెను కచ్చితంగా ఉరితీస్తుంది. ప్రస్తుతం యూనస్‌… పాకిస్తాన్‌తో అంటకాగుతున్నారు. పాక్‌ పొడ గిట్టని హసీనాను బతకనివ్వరు. బంగ్లాలో గత అల్లర్ల సమయంలో దెబ్బతిన్న కుటుంబాలు కూడా హసీనాపై రగిలిపోతున్నాయి. కాబట్టి ఆమెను ఉరితీసి ఆ దేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకోవాలన్నది యూనస్‌ కోరిక. అయితే భారత్‌ మాత్రం హసీనాను అంత ఈజీగా అప్పగించేలా లేదు. ఆమె తండ్రి కాలం నుంచి భారత్‌తో సత్సంంబంధాలున్నాయి. ఆమె అధికారంలో ఉన్నన్ని రోజులు మనకు మద్దతుగానే ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు బంగ్లాను అడ్డాగా మారకుండా చూశారు. ఇప్పుడు యూనస్ ప్రభుత్వం వచ్చాక పాక్‌ ఉగ్రవాదులకు బంగ్లా సేఫ్‌జోన్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో తన మిత్రులను శత్రువు చేతికి భారత్‌ అప్పగించే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇది బంగ్లాతో శత్రుత్వానికి దారి తీసినా న్యూఢిల్లీ లెక్కచేయకపోవచ్చు. మరీ పరిస్థితి దిగజారితే హసీనాను బంగ్లాతో ఒప్పందం లేని ఏదో ఓ దేశానికి పంపినా పంపేయవచ్చు.

Viral Penguin
Viral Penguin : పెంగ్విన్ వైరాగ్యం..! ఎందుకీ ఒంటరి ప్రయాణం..!?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment