NewsDabba

Vijayasai Reddy : ఆహా.. ఏమి సెప్తిరి.. విజయసాయీ..!?

Updated on: January 23, 2026 | By Editorial Team

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాణక్యుడు అని పిలవబడే విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఇప్పుడు కథకుడుగా మారారు. ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసులో ఈడీ విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పిన మాటలు వింటుంటే.. అవి ఒక రాజకీయ నాయకుడి వివరణలా లేవు, తన యజమానిని కాపాడుకోవడానికి ఒక నమ్మకస్తుడైన బంటు అల్లిన కట్టుకథలా ఉన్నాయి. “లిక్కర్ స్కాంతో జగన్‌కు (YS Jagan) సంబంధం లేదు.. ఆయనకు తెలిస్తే అంగీకరించేవారు కాదు” అని సాయిరెడ్డి చెబుతున్న మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నవ్వులాటగా మారాయి. అసలు ఈ స్కామ్‌లో ఉన్న పాత్రధారులెవరు? వారి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఎవరిని కాపాడాలని చూస్తున్నారు?

జగన్ ‘షాడో’ బృందం..

విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఈ వ్యవహారం మొత్తానికి రాజ్ కెసిరెడ్డిని బాధ్యుడిని చేస్తూ, జగన్‌ను పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఈ కేసులో ఈడీ వేళ్లను చూపిస్తున్న వ్యక్తుల నేపథ్యం చూస్తే విజయసాయి రెడ్డి వాదన పేకమేడలా కూలిపోతుంది.

రాజ్ కెసిరెడ్డి: Vijayasai Reddy సృష్టించిన సలహాదారు!

రాజ్ కెసిరెడ్డిని జగన్‌కు (YS Jagan) పరిచయం చేసి, ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగేలా చేసింది సాక్షాత్తూ విజయసాయి రెడ్డే. ఆయనను సలహాదారుగా నియమించడంలో సాయిరెడ్డి (Vijayasai Reddy) పాత్ర ఎంత ఉందో వైసీపీ అంతర్గత వర్గాలన్నిటికీ తెలుసు. ఇప్పుడు అదే రాజ్ కెసిరెడ్డిని పాత్రధారి అని ముద్ర వేసి, జగన్ అమాయకుడని సాయిరెడ్డి సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే తన ద్వారా వచ్చిన వ్యక్తి స్కామ్ చేస్తున్నా సాయిరెడ్డికి తెలియదు.. తన పక్కనే ఉన్న సలహాదారు ఏం చేస్తున్నాడో జగన్‌కు తెలియదు.. ఇదెక్కడి విడ్డూరం?

బాలాజీ గోవిందప్ప: భారతి సిమెంట్స్ ఉద్యోగి!

Tirumala Ghee Scam
Tirumala Ghee : దైవం సాక్షిగా దగా.. భక్తుల మనోభావాలతో జూదం!

ఈ కేసులో అత్యంత కీలకమైన పేరు బాలాజీ గోవిందప్ప. ఈయన ఎవరో బయట వ్యక్తి కాదు. సాక్షాత్తూ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ.. ఏపీ లిక్కర్ పాలసీల (AP Liquor Scam) రూపకల్పనలో, నిధుల మళ్లింపులో ఇంత పెద్ద పాత్ర పోషించారంటే అది జగన్ ఆశీస్సులు లేకుండా సాధ్యమేనా? తన సొంత కంపెనీ మనిషి ఏం చేస్తున్నాడో జగన్‌కు తెలియదు అని విజయసాయి రెడ్డి చెప్పడం అంటే ప్రజల విజ్ఞతను అవమానించడమే.

కోటరీ బ్యాచ్: ధనుంజయ్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి

ఈ ముగ్గురు పేర్లు లేకుండా జగన్ పాలన సాగలేదు.

ధనుంజయ్ రెడ్డి: జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన అధికారి. ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) ఉంటూ ప్రతి ఫైలును గమనించే వ్యక్తి.

మిథున్ రెడ్డి & చెవిరెడ్డి: జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. జగన్ కు కుడిభుజం, ఎడమ భుజంలా వ్యవహరిస్తారు.

వీరందరి పేర్లు లిక్కర్ స్కామ్ విచారణలో వినిపిస్తున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఈ ‘పంచ పాండవులు’ ఆయనకు తెలియకుండానే వేల కోట్ల స్కామ్ నడిపించారంటే అది అతిపెద్ద జోక్ అవుతుంది.
అంతేకాదు.. జగన్ కు తెలీకుండానే ఈయన కూడా లిక్కర్ స్కాం నిందితులతో హైదరాబాద్ లో రహస్యంగా సమావేశమయ్యారంటే ఎవరైనా నమ్ముతారా..? పైగా వాళ్లకు అరబిందో నుంచి రూ.వంద కోట్ల రుణం కూడా ఇప్పించారట.

Vijayasai Reddy ‘డబుల్ గేమ్’.. ఎందుకీ కవరింగ్?

విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) వైఖరిని గమనిస్తే ఆయన ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు జగన్ (YS Jagan)కు నెంబర్ టూ గా ఉన్న సాయిరెడ్డి, వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారో అందరికీ తెలుసు. జగన్ తనను కాదని వేరే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన సహించలేకపోయారు. అప్పుడు అదే కోటరీని విమర్శించిన సాయిరెడ్డి, ఇప్పుడు మళ్ళీ అదే కోటరీ చేసిన తప్పులకు జగన్ కు సంబంధం లేదని వెనకేసుకొస్తున్నారు.

Mudragada Padmanabha Reddy
Mudragada : ‘కాపు’ జాతిని కాలదన్ని.. మళ్ళీ కాపు కార్డుతో రాజకీయమా?

కేసుల భయం: ఒకవేళ జగన్ ఈ కేసులో ఇరుక్కుంటే, ఆ తర్వాత నెంబర్ టూ గా ఉన్న తన మీదకు కూడా విచారణ ముదురుతుందని సాయిరెడ్డి (Vijayasai Reddy) భయం. అందుకే జగన్ కు క్లీన్ చిట్ ఇప్పించడం ద్వారా తనను తాను కాపాడుకోవాలని చూస్తున్నారు.

రాజకీయ అస్థిరత: వైసీపీ నుంచి బయటకు వచ్చాక బీజేపీలో చక్రం తిప్పుదామనుకున్న సాయిరెడ్డికి అక్కడ చుక్కెదురైంది. ఆయన ‘డబుల్ స్టాండర్డ్స్’ చూసి బీజేపీ హైకమాండ్ ఆయన్ను నమ్మడం మానేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ ‘జగన్ భజన’ చేయడం ద్వారా తన రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు.

పూటకో మాట.. వేషానికో రంగు!

విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) మాటలకు విశ్వసనీయత ఎంత ఉందో ఆయన గత ప్రకటనలే సాక్ష్యం.

వ్యవసాయం: “రాజకీయాలకు రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటాను” అని వెళ్లిన ఆయన, మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు.

మీడియా: గతంలో నిత్యం రామోజీ రావును, ఈనాడును తిట్టిపోసేవారు. సొంతంగా పత్రిక పెడతానని ఊదరగొట్టారు. అధికారం పోగానే ఆ మాటలు అటకెక్కాయి.

కోటరీ విమర్శలు: కోటరీ వల్లే జగన్ (YS Jagan) ఓడిపోయారని చెప్పారు. కోటరీని పక్కన పెడితేనే ఆయన గెలుస్తారని చెప్తారు. కానీ జగన్ కు తెలీకుండా కోటరీ తప్పులు చేస్తోందంటారు. జగన్ కి సంబంధం లేదని కవర్ చేస్తున్నారు.

విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఎంతగా గొంతు చించుకుని జగన్ కి క్లీన్ చిట్ ఇచ్చినా, సామాన్య ప్రజలు దీన్ని మరోలా చూస్తున్నారు. భారతి సిమెంట్స్ లో పనిచేసే బాలాజీ గోవిందప్ప లాంటి వ్యక్తులు స్కామ్ లో ఉంటే, అది నేరుగా ‘తాడేపల్లి’ గడప దాటి వెళ్లినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

AP Politics
AP Politics: ఏపీ రాజకీయాల్లో ‘ప్రతీకార’ పర్వం

విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఆడుతున్న ఈ “కవరింగ్ డ్రామా” ఈడీ ముందు సాగుతుందేమో గానీ, ప్రజల ముందు మాత్రం సాగదు. ఎందుకంటే, 14 ఏళ్ల సాన్నిహిత్యం, ఆర్థిక లావాదేవీల చరిత్ర ఉన్న సాయిరెడ్డికి జగన్ కి తెలియకుండా ఏమీ జరగదన్న సత్యం అందరికంటే బాగా తెలుసు.

ముసుగు తొలగే సమయం ఆసన్నమైందా?

“తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే” అని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు తప్పు చేసిన వారిని కాపాడటానికి సిద్ధాంతాలను మారుస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫానును సృష్టించబోతోంది. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఎంతగా కవర్ చేసినా, ఈడీ విచారణలో బయటకు వస్తున్న పేర్లు, వారి నేపథ్యాలు అన్నీ ఎక్కడికి దారి చూపిస్తున్నాయో అందరికీ తెలుసు.

రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకుడి మాటలను కాలం ఎలాగూ మర్చిపోతుంది. కానీ, వ్యవస్థలను తప్పుదోవ పట్టించి, స్కామ్‌లను కప్పిపుచ్చాలని చూసే ప్రయత్నాలు మాత్రం చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment