# NEWS DABBA ## Posts - [Nobel - Trump: ట్రంప్ 'నో-బెల్' ఘోష..! ఇక 'సెల్ఫ్-పీస్ అవార్డ్' సృష్టి!](https://newsdabba.com/satire-trump-decided-to-create-a-new-peace-prize-award-on-behalf-of-him/): ప్రపంచ రాజకీయాలను తనదైన ప్రసంగాలతో దడదడలాడించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల కల్లగానే మిగిలిపోయింది. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. దీంతో, శాంతి బహుమతి కోసం ఆయన చేసిన అలుపెరగని, అవిశ్రాంత మైక్ శబ్దాలన్నీ మూగబోయాయి. పాపం.. నోబెల్ కమిటీ అగౌరవపరిచిందంటూ ట్రంప్ అభిమానులు, ట్రంప్ స్వయంగానూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ట్రంప్ కు నోబెల్ ఇవ్వలేదంటే.. అది కేవలం ఆయనకు జరిగిన అన్యాయం కాదట! యావత్ ప్రపంచానికే జరిగిన అన్యాయమట..!! శాంతి బహుమతి తనకు దక్కలేదంటే.. మిగిలిన ఎవరికీ ద్కే అర్హత లేదంట..! శాంతి బహుమతి కోసం శాంతియుత పోరాటం చేయాల్సింది పోయి.. రోజూ గొంతెత్తి ఏడుస్తున్నారు. అయినా నోబెల్ కమిటీ మాత్రం మీడియాలో చేసే సౌండ్ లను తాము పట్టించుకోబోమని కమిటీ తేల్చేసింది. దీంతో ట్రంప్ కు మరింత కాలుతోందట..! ట్రంప్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన నోబెల్ కమిటీ సభ్యులు తీవ్రమైన గందరగోళంలో పడ్డారని అంతర్గత సమాచారం. […] - [TDP - YCP : టీడీపీ, వైసీపీకి తేడా ఇదే..!](https://newsdabba.com/difference-between-tdp-and-ycp/): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ చిన్న సంఘటన అయినా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో టీడీపీ నేతల పాత్ర బయటపడటం, దానిపై ఆ పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవడం, అయినా కూడా వైసీపీ విమర్శలు ఆపకపోవడం – ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయ నీతి, జవాబుదారీతనం గురించి కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని పార్టీ, తమ నేతలపై అవినీతి మరక లేదా అక్రమాల ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగా తక్షణమే, కఠినంగా స్పందిస్తుందనే వాదన ఉంది. తాజా కేసులో, సంబంధిత నేతలు కల్తీ మద్యం తయారీలో పాలుపంచుకున్నారనే ఆరోపణలు రాగానే, టీడీపీ వెంటనే స్పందించింది. ఆ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో, లేదా దూరం పెట్టడమో చేసింది. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా, తప్పు చేస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అనే సందేశాన్ని పార్టీ అధిష్టానం ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నించింది. […] - [Shocking: న్యాయస్థానంలో అరాచకం.. 'నల్లకోటు' వెనుక దాగి ఉన్న అసహనం!](https://newsdabba.com/shocking-%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%af%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%b0%e0%b0%be%e0%b0%9a%e0%b0%95%e0%b0%82-%e0%b0%a8/): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)పై చెప్పుతో దాడికి ప్రయత్నించడం అనేది కేవలం ఒక వ్యక్తి చేసిన వికృత చేష్ట కాదు; ఇది దేశ న్యాయవ్యవస్థ గుండెకాయపై జరిగిన దాడి. చట్టాన్ని పరిరక్షించాల్సిన, న్యాయం అందించాల్సిన న్యాయవాద వృత్తికి చెందిన వ్యక్తి ఈ అరాచకానికి పాల్పడటం యావత్ వ్యవస్థకు సిగ్గుచేటు. ఇది న్యాయమూర్తుల గౌరవాన్ని తుంగలో తొక్కి, చట్టబద్ధ పాలనకు (Rule of Law) సవాల్ విసిరిన అత్యంత హేయమైన చర్య. ఎవరీ న్యాయవాది? చట్టంపై దాడికి పాల్పడటం వెనుక అంతర్యం ఏమిటి? ఈ చర్యను సాధారణ కోర్టు ధిక్కారంగా చూడలేం. దీని వెనుక కొన్ని తీవ్రమైన అంతర్లీన అంశాలు దాగి ఉన్నాయి: 1. చట్టం స్థానంలో భావోద్వేగాల పెత్తనం ఈ దాడికి కారణం CJI గతంలో చేసిన ఒక వ్యాఖ్యపై సదరు న్యాయవాదికి ఉన్న మతపరమైన భావోద్వేగం. న్యాయస్థానంలో భావోద్వేగాలకు, ఉద్రేకపూరిత చర్యలకు తావు ఉండకూడదు. ఒక న్యాయవాదిగా, తీర్పులు లేదా […] - [AP Govt: ప్రోటోకాల్ పాటించరా.. చంద్రబాబు గారూ..?](https://newsdabba.com/rulers-who-do-not-follow-the-protocol-in-ap/): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (NDA Govt) ప్రోటోకాల్‌కు (protocol) పూర్తిగా తిలోదకాలిచ్చినట్టు అర్థమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం ఇప్పటివరకూ అద్భుతంగా సాగుతోంది. ఒకదానికొకటి గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అడపాదడపా కిందిస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నా, పైస్థాయిలో మాత్రం నేతల మధ్య మంచి సమన్వయం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టేసి నేతలంతా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాభిశ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి. అలా కాకుండా ప్రజాశ్రేయస్సు కంటే తమ అధికారమే ముఖ్యమని పార్టీలు భావిస్తే నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అధికార కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య అవసరమైన గీతను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఈ మధ్య డీఎస్సీ విజేతలకు ప్రభుత్వం అమరావతిలో […] ## Pages - [SPORTS](https://newsdabba.com/sports/) - [LIFE STYLE](https://newsdabba.com/life-style/) - [ENTERTAINMENT](https://newsdabba.com/entertainment/) - [BUSINESS](https://newsdabba.com/business/) - [TECHNOLOGY](https://newsdabba.com/technology/) - [SPECIALS](https://newsdabba.com/specials/) - [EDITORIAL](https://newsdabba.com/editorial/) - [ANALYSIS](https://newsdabba.com/analysis/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)